వైయస్‌ జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం..

వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు..

ఏలూరు: రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ పాలన మళ్లీ రావాలని ప్రజలకు కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మళ్లీ ఆ పాలన  వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ద్వారా రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు.ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జనలో ఆయన ప్రసంగించారు. వైయస్‌ఆర్‌ పాలనలో ప్రజలు ఆత్మాభిమానంతో జీవించారన్నారు. సామాజిక గౌరవాన్ని పోందేవిధంగా వైయస్‌ఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. కొంతకాలంగా తెలుగుదేశం పాలన చూస్తున్నామని.. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో లేని ఐదు సంవత్సరాలు...అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు చూస్తే..బీసీల్లో ఏ ఒకరినైనా రాజ్యసభకు పంపించిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ.. కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకుందని..ఒక బీసీనైనా మంత్రిని చేశారా అని ప్రశ్నించారు. బీసీ పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు.

Back to Top