ఎన్ని అడ్డంకులు సృష్టించిన భయపడేది లేదు

టీడీపీ పాలన దుర్మార్గం

టీడీపీ అరాచకాలను ప్రజలు సహించరు

వైయస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి 

ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు. కమ్మపాలెంలో టీడీపీ పార్టీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చిన నాయకులు పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమయ్యారని..వారిని పోలీసులను అడ్డంపెట్టుకుని అరెస్ట్‌ చేయించారన్నారు. టీడీపీ అరాచకాలను ప్రజలందరూ చీదరించుకుంటున్నారన్నారు.ఈ ప్రాంతంలో చంద్రబాబు  కులానికి చెందిన వారే  పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారని, దీంతో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ తరపున ఉన్నారని, టీడీపీ ఎన్ని అడ్డుంకులు సృష్టించిన భయపడేదిలేదన్నారు.

Back to Top