వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు.

వెలిగొండలో చంద్రబాబు చేసిందేమిటి?

నాడు వైయస్సార్‌గారు మొదలుపెట్టారు

ఆ తర్వాత టన్నెల్‌ పనుల్లో జగన్‌ దూకుడు

అప్పుడే ప్రాజెక్టులో దాదాపు పనులన్నీ పూర్తి

ఆనాడే ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన జగన్‌

ఇకనైనా క్రెడిట్‌ చోరీ ఆపండి చంద్రబాబు

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టీకరణ

తాడేపల్లి: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్‌గారు తన హయాంలో చేసిన చారిత్రక పనులను తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌గారు ఆ ప్రాజెక్టులో 85 శాతానికి పైగా పనులు పూర్తి చేసి, 2024, మార్చి 6న జాతికి అంకితం చేశారని వెల్లడించారు. అయినా వెలిగొండ ప్రాజెక్టు మొత్తం తానే నిర్మించినట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. మరోవైపు ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు కూడా ఇంకా పరిహారం చెల్లించలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు అబద్ధాల నకిలీ ముఖ్యమంత్రి:
    సీఎం చంద్రబాబునాయుడుగారు ఎదుటివారు చేసిన మంచిని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ఒక నకిలీ ముఖ్యమంత్రిగా మారిపోయారు. తాను చేయని పనులను చేసినట్లు చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టుపై క్రెడిట్‌ చోరీకి తన అనుకూల ఎల్లో మీడియాతో కలిసి నానా తంటాలు పడుతున్నారు.

వెలిగొండలో చంద్రబాబు చేసిందేమీ లేదు:
    1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్‌ లేవనెత్తగా, 1994లో డీపీఆర్‌ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు. ఆ తర్వాత 2004 వరకు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని మీటర్ల సొరంగం తవ్వారు అంటే ఏదీ లేదు. 1996లో ఆయన ప్రాజెక్టు కోసం ఒక రూ.11 లక్షలు ఖర్చు చేశారు. అది కూడా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సభ నిర్వహణ కోసం ఖర్చు చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, వీటన్నింటిపై ఆయన మాట్లాడాలి.

ప్రాజెక్టుకు జీవం పోసింది మహానేత వైయస్సార్‌:
    2004లో ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం కింద వెలిగొండ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ప్రాజెక్టుకు రెండో సొరంగాన్ని  ప్రతిపాదించి సమగ్ర డీపీఆర్‌ తెచ్చింది వైఎస్సార్‌ గారే. నల్లమల సాగర్‌ 3 డ్యాములు, ఫీడర్‌ ఛానల్‌ నిర్మించి ప్రాజెక్టుకు పూర్తి రూపునిచ్చారు. 2004 నుంచి 2014 మధ్య వైఎస్సార్‌ హయాంలో రెండు టన్నెల్లో కలిపి ఏకంగా 20.33 కిలోమీటర్ల (టన్నెల్‌–1లో 11.58 కి.మీ, టన్నెల్‌–2లో 8.74 కి.మీ) మేర సొరంగం తవ్వకాలు జరిగాయి..

చంద్రబాబు నత్తనడక. జగన్‌గారు జెట్‌ స్పీడ్‌:
    2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం 6.6 కి.మీ మేర మాత్రమే సొరంగ తవ్వకాలు జరిగాయి. అదే జగన్‌గారి హయాంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి.
టన్నెల్‌ 1: చంద్రబాబు హయాంలో రోజుకు 2.41 మీటర్ల వేగంతో పనులు జరిగితే, వైయస్‌. జగన్‌ హయాంలో రోజుకు 4.12 మీటర్ల వేగంతో (రెట్టింపు వేగం) పనులు జరిగాయి.
టన్నెల్‌ 2: బాబు హయాంలో రోజుకు 1.31 మీటర్ల మేర జరిగితే, జగన్మోహన్‌ రెడ్డి పాలనలో రోజుకు 7.27 మీటర్ల వేగంతో ఏకంగా 5.53 రెట్ల వేగంతో పనులు పరుగులు పెట్టాయి. సుమారు రూ.12 వేల కోట్లు వెచ్చించి 85 శాతానికి పైగా పనులను వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు.

జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు మళ్లీ ప్రారంభోత్సవం!:
    వెలిగొండ ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసిన శ్రీ వైయస్‌ జగన్, 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టుకు వెళ్లి మళ్లీ రిబ్బన్‌ కట్‌ చేయడానికి చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? చంద్రబాబు ఎప్పుడూ జేబులో కత్తెర, చేతిలో రిబ్బన్‌ పట్టుకుని ఎదుటివారు చేసిన పనులకు క్రెడిట్‌ కొట్టేయడానికే చూస్తుంటారు.

రూ.112 కోట్ల నిర్వాసితుల పరిహారం ఎందుకు ఇవ్వరు?:
    వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, గ్రామాలు త్యాగం చేసిన నిర్వాసితులను వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారులు విచారించి 758 అర్జీలు అర్హత గలవని తేల్చినా వారికి పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? వీరికి న్యాయం చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు కేవలం రూ.112 కోట్లు మాత్రమే. అమరావతిలో అద్దాల కోసం వేల కోట్లు తగలేస్తున్న సీఎం చంద్రబాబుకు, ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన రైతులకు రూ.112 కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదా? ఇప్పటికైనా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వెంటనే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి.
    ఇంకా సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి, దమ్ము ధైర్యం ఉంటే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో వెలిగొండ ప్రాజెక్టునే ఎజెండాగా పెట్టి ఎన్నికల రెఫరెండానికి రావాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు సవాల్‌ చేశారు.

Back to Top