నంద్యాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై కత్తులతో దాడి  

సురేష్‌ను ప‌రామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే శిల్పా

నంద్యాల‌: నంద్యాల శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద బైక్ పై వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త సురేష్ కళ్ళల్లో కారం చల్లి దుండ‌గులు కత్తులతో దాడి చేశారు. గ్రామంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు సురేష్‌ అడ్డుపడుతున్నారని నెపంతో దాడికి పాల్పడినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ప‌రామ‌ర్శించారు.  శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని, ఇప్పటికే నాలుగు హత్యలు చోటు చేసుకున్నాయని శిల్పా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిడిపి నాయకుల అరాచకాలను ధైర్యంగా ప్ర‌శ్నిస్తునందుకే సురేష్‌పై దాడి చేశార‌ని మండిప‌డ్డారు.  దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనకు దిగుతామని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి హెచ్చరించారు.

Back to Top