ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ కీలక సమావేశం 

ప్ర‌కాశం జిల్లా: ఒంగోలు న‌గ‌రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పరిశీలకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

Back to Top