రైతు మృతి ప్రభుత్వ హత్యే..

రైతుల పట్ల పోలీసుల తీరు అమానుషం..

వైయస్‌ఆర్‌సీపీ నేత నాగిరెడ్డి

 మృతుడు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ..

గుంటూరు: రైతుల పట్ల పోలీసుల తీరు అమానుషమని  వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి పరామర్శించారు. చంద్రబాబు కొండవీడు పర్యటన సందర్భంగా పోలీసుల లాఠీదెబ్బలతో ప్రాణాలు కోల్పోయిన రైతు కోటయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.కోటయ్య మృతి ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. కోటయ్య కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.పచ్చని పొలాన్ని నాశనం చేయొద్దంటూ అడ్డుకున్న రైతులపై ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యహరించడం దారుణమన్నారు.ఒక రైతు కుటుంబం ప్రభుత్వం విధానాలు మూలంగా రోడ్డున పడిందన్నారు. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు.చంద్రబాబు వెనుకబడిన వర్గాల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన బీసీల ఓట్లతోనే ఆయన గెలిచారన్నారు.బీసీ వర్గానికి చెందిన రైతుపై అరాచకాలకు పాల్పడటం దారుణమన్నారు.ఇది మూమ్మాటికి ప్రభుత్వ హత్య అని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Back to Top