రేపు నిడ‌ద‌వోలులో వైయ‌స్ఆర్ కాపునేస్తం

 బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి

తాడేప‌ల్లి:  రేపు (16.09.2023) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ కాపునేస్తం నిధులు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్‌ ఆంబ్రోస్‌ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం వైయ‌స్ఆర్‌ కాపునేస్తం నిధులు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top