నేడు ‘వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా’ చెల్లింపు

9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1252 కోట్ల పరిహారం 

తాడేపల్లి: తన సుదీర్ఘ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీళ్లను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. నాడు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన‌ మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు అండగా నిలిచారు. ఈ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేడు అమలు చేస్తున్నారు. 2019 సీజన్‌లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన 9.48 లక్షల రైతులకు ఏకంగా రూ.1252 కోట్ల పరిహారం అందించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top