అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు

పులివెందుల‌:  అంద‌రూ క‌దిలి రండి, త‌ప్ప‌కుండా ఓటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఉద‌యం నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ మొద‌లైంది. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఓట‌ర్ల‌కు పిలుపునిస్తు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…

అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top