15వ ఫైనాన్స్ నిధులపై కూటమి ప్రభుత్వ పెత్తనం తగదు

వైయ‌స్ఆర్‌సీపీ పంచాయ‌తీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు వెన్నపూస ర‌వీంద్రారెడ్డి ఆగ్రహం 

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు  

నంద్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ పంచాయత్ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బెలుం గుహలను సందర్శించడానికి వచ్చిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అల్ ఇండియా ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వెన్నపూస రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ… రాజ్యాంగ పరంగా పంచాయతీ రాజ్ సంస్థలకు కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా పెత్తనం చెలాయిస్తూ దొంగ సర్క్యూలర్లు జారీ చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా మెమో నంబర్ 3082065 (తేది: 24-12-2025) ద్వారా నిధులను వినియోగించకుండా అడ్డుకోవడం పూర్తిగా అన్యాయమన్నారు. ఈ మెమోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పొందవలసిన గౌరవ వేతనాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రోటోకాల్‌ను పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అన్ని చర్యలకు కారణం ఒక్కటే… స్థానిక ప్రజాప్రతినిధులు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన వారే కావడమని వెన్నపూస రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఇలాంటి దొంగ సర్క్యూలర్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది అవుతాయని హెచ్చరిస్తూ, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ అంశాలపై స్పందించిన అల్ ఇండియా ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా వివరణ కోరతామని, అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా విభాగం అధ్యక్షులు రామ లక్ష్మయ్య, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి గారి సురేష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సీవీ రంగా రెడ్డి, సర్పంచుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు మూలి లోక్‌నాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, కాలు నాయక్, వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చంద్ భాష, పెరుమాళ్ల శేషన్న, సర్పంచులు గురివీ రెడ్డి, పి. లక్ష్మినారాయణ రెడ్డి, అంజి నాయక్, యూత్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్యాలు, వెంకటయ్య, రామాంజినేయులు, కృష్ణుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

Back to Top