రాష్ట్రమంతా వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ పండుగ

వాడవాడలా రెపరెపలాడుతోన్న వైయస్‌ఆర్‌ సీపీ జెండా

సంక్షేమ సారధి సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు

అంబరాన్ని అంటుతున్న వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణుల సంబరాలు

తాడేపల్లి: ఆంధ్రరాష్ట్రమంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ పండుగ సాగుతోంది. నాడు ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద.. వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం పురుడోసుకున్న జెండా నేడు వాడవాడలా రెపరెపలాడుతోంది. విలువలు, విశ్వసనీయతే శ్వాసగా, ప్రజల సంక్షేమమే ధ్యాసగా సాగిన వైయస్‌ఆర్‌ సీపీ నేడు 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. నాడు వైయస్‌ జగన్, వైయస్‌ విజయమ్మతో ప్రారంభమైన వైయస్‌ఆర్‌ సీపీ ప్రస్థానం.. నేడు దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు నిలువుటద్ధంగా మారింది. రాష్ట్రం కనీవినీ ఎరుగుని రీతిలో 2019 ఎన్నికల్లో ప్రజాభిమానం చురగొనడం.. అంతటితో ఆగిపోకుండా జనం మెచ్చి ఇచ్చిన అవకాశం ప్రజాసేవకేనని, తాను వేసే ప్రతి అడుగులోనూ చాటిచెబుతున్నారు సీఎం వైయస్‌ జగన్‌. జెండా మోసిన ప్రతీ కార్యకర్త కాలర్‌ ఎగరేసుకునేలా పాలన సాగుతోంది.

12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ వేడుకను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా వైయస్‌ఆర్‌ జెండా రెపరెపలాడుతోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సంక్షేమ సారధి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్రపటాలకు ప్రజలు, పార్టీ నేతలు పాలాభిషేకాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్‌ కటింగ్‌లు, స్వీట్ల పంపిణీ, హోరున జైజగన్‌ నినాదాల సంబరం అంబరాన్నంటుతున్నాయి. 

Back to Top