మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ ..సరిలేరు నీకెవ్వరు

‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ వైయస్‌ జగన్‌

ఇండియా టుడే పోల్‌ సర్వేలో నాలుగో స్థానంలో నిలిచిన ముఖ్యమంత్రి
 

అమరావతి: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా ఖ్యాతి గడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైయస్‌ జగన్‌  ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు.  

అనతి కాలంలో అనేక పథకాలు 
జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన వైయస్‌ జగన్‌ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చేలా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌), జగనన్న వసతి దీవెన (హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20 వేలు), ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన సీఎం ఒక్క వైయస్‌ జగన్‌ తప్ప దేశంలో మరొకరు కనిపించరు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారు.   వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయించారు. ప్రజారంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సరిలేరు అంటూ ఆంధ్రావని ముక్తకంఠంతో నినదిస్తోంది. 

తాజా వీడియోలు

Back to Top