రేణిగుంటలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

తిరుప‌తి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగించుకున్న వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు రైల్‌లో నిన్న రాత్రి బ‌య‌లుదేరి ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్‌ నినాదాలతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్‌ అంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం.
 

Back to Top