తాడేపల్లి: చంద్రబాబు నాయుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసేందుకు గాడిదలు కాసేందుకా అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌మీడియాతో మాట్లాడారు. నాణేనికి ఇటువైపు.. నాణేనికి ఇటువైపున కొన్ని అంశాలపై మీ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి నిజాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు మాట్లాడే అంశాల్లో రైతు సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు, కొత్త మెడికల్ కాలేజీలు, విశాఖ స్టీల్ ప్లాంట్, రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో నుంచి చివరికి టీడీపీలో జరుగుతున్న లడ్డూ, పరకామణి వ్యవహారాలు, చివరగా చంద్రబాబు ఏరకంగా తన కేసులను తాను దగ్గరుండి మూసివేయిస్తున్నాడు. చంద్రబాబు తానే దొంగ, తానే ప్రాసీక్యూటర్, తనదే గవర్నమెంట్, తానే అధికారులపై ఒత్తిడి చేయడం, తన మీద ఉన్న కేసులు తానే కోర్టుల్లో పిటిషన్లు ఎలా వేయించుకొని ఉపసంహరించుకుంటున్నాడు. ఇవన్నీ బెయిల్ షరత్తులు ఉల్లంఘించడం కాదా. ఈ అంశాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రైతుల సమస్యలు: సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్న రీతిలో పాలన రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది..రైతుల పరిస్థితి ఎలా ఉందన్నది చూస్తే బాధేస్తుంది..రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్న రీతిలో పాలన సాగుతోంది. అందరూ కూడా హాల్ ఇండియా ఏపీ వైపుచూడండి అనాల్సిన పరిస్థితిలో పాలన సా గుతోంది. వ్యవసాయం అన్నది 62 శాతం జనాభా ఆధారపడి ఉన్న సెక్టార్. ఈ వ్యవసాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయాన్ని పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు. రైతు సంతోషంగా ఉంటేనే..రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ ఎదగదు. వెనుకడగు వేయాల్సింది. మా హయాంలో వ్యవసాయం పండుగ..నేడు దండగలా మార్చారు మా హయాంలో వ్యవసాయం పండుగలా ఉంటే..ఇవాళ చంద్రబాబు పాలనలో దండగలా మార్చారు. మొన్ననే మొంథా తుపాన్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారంటే..చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన దత్తపుత్రుడు ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లి ఏ రకంగా ముగ్గురు కలిసి బిల్డప్ ఇచ్చారంటే..వీళ్లకు తోడు వాళ్ల ఎల్లో మీడియా బిల్డప్ చూస్తే..ఏకంగా వీళ్లే తుపాన్ పీక పట్టుకుని డైవర్ట్ చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. వీళ్లు గాన ఆర్టీజీఎస్ టీవీల ముందు కూర్చుని ఉండకపోతే ఆ తుపాన్ ఆగేది కాదు అన్నట్లుగా ఆ కూర్చిలో కూర్చొని ఆపినట్లు బిల్డప్ ఇచ్చారు. ఏ రైతుకూ పైసా సాయం అందలేదు తుపాన్ బీభత్సం చూస్తే ..ప్రభుత్వం స్పందించిన తీరు..ఫైనల్ పరిస్థితులు ఏంటని చూస్తే తుపాన్ కారణంగా నష్టపోయిన ఏ రైతుకు పైసా సాయం కూడా అందలేదు. దాదాపు 15 లక్షల ఎకరాలను తగ్గించి 4 లక్షల ఎకరాలకు కుదించారు. కుదించిన దానికి కూడా పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. ఈ తుపాన్ పక్కన పెట్టండి. 19 నెలల్లో 17సార్లు ప్రకృతి వైఫరీత్యాలు చంద్రబాబు 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో 17 సార్లు ప్రకృతి వైఫరిత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల జీవితాలు క్షిణ్ణభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. దాదాపుగా రూ.1100 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులు ఇచ్చి ఈ పెద్ద మనిషి పుణ్యం కట్టుకోలేదు. ఈ బకాయిలు ఇవ్వకపోగా పైగా ఈ పెద్దమనిషి వచ్చిన వెంటనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశాడు. మా హాయంలో రూ.7,800 వేల కోట్లు ఉచితంగా చెల్లించాం. ఈ రోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక వైపు ఇన్‌పుట్ సబ్సిడీ రాదు..చంద్రబాబు పుణ్యానా ఉచిత పంటల బీమా రావడం లేదు. దాదాపుగా 84 లక్షల మంది రైతులకు గాను కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే..ఖరీఫ్ సమయంలో 87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ రోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తోంది. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడో చెప్పడు రోజు చంద్రబాబు నుంచి స్పీచ్‌లు వింటున్నాం. ఆ స్పీచ్‌లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడే తప్ప రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తాడో చెప్పాడు. నష్టపోయిన రైతులకు ఎప్పుడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాడో చెçప్పడు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అన్న పేరు పెట్టి ప్రతి ఏటా రూ.20 ఇవ్వాలి. రెండేళ్లలో రూ.40 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. రూ.30 వేలు మోసం చేశాడు, మరోవైపు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. రైతు భరోసా కనుమరుగైంది. ఉచిత పంటల బీమా రైతులకు రావడం లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ఈ రోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. గతేడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, ఉల్లి, టమాటా, చీని, మామిడి పంటలు ఏ పంట తీసుకున్నా కూడా మద్దతు ధర లేదు. ఈ ఏడాది కూడా అంతే..ఇప్పటికే మొంథా తుపాన్‌లో నష్టపోయిన ఆ రైతుల ధాన్యాన్ని కొనే నాథుడు లేడు. 75 కేజీల బస్తా ఎంఎస్‌పీ ప్రకారం రూ.1776 రావాలి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రైతులు రూ.1200, రూ.1300లకు ఇస్తారా అని దళారులు అడుగుతున్నారు. దిత్వా తుపాన్ వస్తుందని పది రోజుల ముందే తెలుసు! ప్రస్తుతం దిత్వా తుపాన్ చూస్తున్నాం. ఈ తుపాన్ పంట కోతల సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసినపంట ఇంకా కళ్లాల్లోనే ఉందని తెలుసు. ఈ పంట కొనకపోతే ధాన్యం తడిసిపోతుందని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిన్నారు..ఈ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారని తెలుసు..కానీ చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు. రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగడం లేదు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నాను. మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేదో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. మా హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వార్ పుట్టింగ్ బేస్ మీద యంత్రాంగం అంతా పని చేసింది. వెంటనే గన్నీ బ్యాగ్స్ సరఫరా చేశాం. లాజిస్టిక్స్ కోసం వెంటనే లారీలను రంగంలోకి దించాం. ఆర్‌బీకేలు వెంటనే యాక్టివేట్ అయ్యేవి. పంట కొనుగోలు వర్షానికన్నా ముందే టకటకా కొనుగోలు చేశాం. గతంలో ఇదంతా జరిగింది. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే రైతులు ఏమైనా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరి రైతులే కాదు..ఈ రోజు అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశనగ చూసినా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ధరలు ఉన్నాయంటే.. కేజీ అరటి అర్ధరూపాయి. రైతులు ఎలా బతుకుతారని అడుగుతున్నాను. ఇంత ఘోరంగా చంద్రబాబు కూటమి పాలన సాగుతోంది. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపించాం గతంలో మా ప్రభుత్వం హయాంలో పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి సందర్భాల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించాం. అనంతపురం నుంచి ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబాయి, నంద్యాల, కర్నూలు నుంచి గజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీని వల్ల రైతులకు దళారుల బెడద తగ్గింది. రవాణా ఖర్చులు దాదాపు 40 శాతం తగ్గింది. పెద్ద ఎత్తున ఎగుమతులు అందుబాటులోకి వచ్చాయి. మా ప్రభుత్వం రాకముందు అరటి ఎక్స్‌పోర్ట్స్ 23 వేల టన్నులు ఉంటే, 2023–2024లో మా ప్రభుత్వంలో అరటి 3 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. రైతులకు అదనంగా 20 నుంచి 40 శాతం రేట్లు పెరిగాయి. ఈ ప్రభుత్వం ఇంత వరకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా? గట్టిగా అడుగుతున్నాను.. గాడిదలు కాసేందుకు కాదు కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది చంద్రబాబూ..నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు..గాడిదలు కాయడానికా నిన్ను ముఖ్యమంత్రిని చేసుకుంది. కాదు కదా? రైతులను పట్టించుకోవాలి కదా?. చివరకు పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజీని మా ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవం చేశాం. ఆ కోల్డ్ స్టోరేజీ ఇవాళ ఆపరేషన్‌లో లేదు. కారణం కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని కోల్డ్‌స్టోరేజిని మూసివేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతున్నాయి. గత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు రైతులను ఏయే హామీలు ఇచ్చారో నేను ప్లే చేసి చూపించాను. రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. రైతులకు హక్కుగా ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఆర్‌బీకేలు నిర్వీర్యం అయ్యాయి. ఈ–క్రాప్ వ్యవస్థ తెరమరుగైంది. తూతూమంత్రంగా ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్లు చేశారు. రైతు సాగు చేసిన పంట పొలంలో ఆ రైతును నిలబెట్టి ఫోటో తీసి దాన్ని జీయో ట్యాగ్ చేయాలి. పంట సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆర్‌బీకేలో నమోదు చేయాలి. రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా ఆర్‌బీకేలో గతంలో ఒక పోస్టర్ ఉండేది. ప్రతి పంటకు ఈ గిట్టుబాటు ధర అంటూ ధరల పట్టిక ఆర్‌బీకేలో ఉండేది. ఎక్కడైనా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి ఆ ఆర్‌బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసే ఏర్పాట్లు చేసేవారు. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్లు తయారయ్యాయే తప్ప.. అసలు పంటలో రైతును నిలబెట్టి ఫొటో తీసి జియో ట్యాయ్ చేసి, ఇన్ని ఎకరాలు రైతు వేశాడు, ఈ ఎకరాల్లో ఈ పంట వేశాడు అనేదాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసేది ఈ క్రాప్. ఆ తర్వాత ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా, గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది. ప్రతి పంటకూ ఇది గిట్టుబాటు ధరలు ఉండేవి. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. డస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్ కు వెళ్లేది. జాయింట్ కలెక్టర్.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ ఫెడ్ గా అసైన్ చేసేవాళ్లం. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వెన్ అయ్యి పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకూ కూడా రాకూడదను అని ఆరాటపడిన పాలన ఆరోజుల్లో. ఒకపక్క ఏమో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమై కనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ మోసమై కనిపిస్తున్నాయి. రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు? రైతన్నా మీకోసం అని ప్రచారం చేసుకుంటాడు. ఈనాడు పేపర్లో కటింగ్ చూడండి ఓసారి.. రైతన్నా మీకోసం అంట. ఏంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్లకు. పోతే రైతులు తిడతారు, కొడతారు. ఎవడూ పొయ్యింది లేదు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్ మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం ఏనాడైనా నిలబడ్డాడా? పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు, ఒక్క అబద్ధమే కాదు, ఈ మధ్య ఇంకో అబద్ధం నిస్సిగ్గుగా ఆడుతున్నాడు. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు ఇచ్చేశాం అంటున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయాలు.. సూపర్ సిక్సు, సూపర్ హిట్టు.. ఇదీ ఈయన ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్ ఈ మధ్య కాలంలో. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు చేసేశాం, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేశాం అని ఏకంగా చెప్పేస్తున్నాడు. నిన్న పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పేస్తున్నాడు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నాడు. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైమ్ లో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెబుతారు. కానీ వాస్తవంగా చంద్రబాబునాయుడు పేరు చెప్పాల. చంద్రబాబు నాయుడు గోబెల్స్ కు టీచర్, మెంటార్. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు, టీవీల్లో ఊదరగొడుతున్నాడు, వాళ్ల పార్టీకి సంబంధించిన వాళ్లతో చెప్పిస్తున్నారు, ఎల్లో మీడియా డిబేట్లు పెట్టి అయిపోయింది అనేస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబునాయుడు 9.5.2024న ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. మేనిఫెస్టోలో పెట్టాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెబుతారా? నిరుద్యోగ భృతి కింద నెలనెలా రూ.3 వేలు ఇస్తానన్నాడు. రెండేళ్లకు కలిపి రూ.72 వేలు ఇవ్వాలి. ఇంతకుముందు ప్రెస్ మీట్లో బాండ్లు కూడా చూపించాను. చంద్రబాబు నాయుడు ఏరకంగా ప్రతి ఇంటికీ పోయి బాండ్ ఇచ్చాడు, వాళ్ల మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు, ఇదిగో చంద్రబాబు సంతకం, అని ప్రమాణ పూర్తిగా ఆయన, ఆయన దత్తపుత్రుడు ఇద్దరి ఫొటోలు పెట్టి వాళ్లిద్దరూ ప్రమాణం చేస్తూ బాండ్లు ఇచ్చారో చూపించాం. వాళ్లు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ చూపించాం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎక్కడ అమలైంది? రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అక్కకూ నెలనెలా రూ.1500 అన్నాడు, సంవత్సరానికి 18 వేలు అన్నాడు, రెండేళ్లయ్యింది రూ.36 వేలు ఇచ్చినాడా? అని అడుగుతున్నా. పోనీ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ అన్నాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇవి. నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి 48 వేలు. రెండేళ్లకు కలిపి 96 వేలు మరి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? అన్నదాతా సుఖీభవ అంటూ పీఎం కిసాన్ కాక సంవత్సరానికి రూ.20 వేలు అన్నాడు, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు, ఇచ్చింది రూ.10 వేలు. రూ.30 వేలు ఎగరగొట్టాడు. ఇది మెసం కాదా? అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అన్నాడు. ప్రతి పిల్లాడికీ రూ.15 వేలు అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరానికి వచ్చే సరికే ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేశాడు. రూ.15 వేలు కాస్తా 8 వేలు, 9 వేలు, పది వేలు,కొందరికి మాత్రమే 13 వేలు. అంటే రెండేళ్లకు కలిపి ప్రతి పిల్లాడికీ ఇవ్వాల్సింది రూ.30 వేలు. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8 వేలు, కొందరికి 9 వేలు, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10 వేలు, కొందరికి 13 వేలు, ఇదీ జరిగింది. ఇది మోసం కాదా? అని అడుగుతున్నా. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. రెండేళ్లకు కలిపి 6 సిలిండర్లు, ఇచ్చింది 2 సిలిండర్లు, అది కూడా అందరికీ ఇవ్వలేదు. ఇది మోసం కాదా? అని అడుగుతున్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తూ కొన్ని బస్సులకే, అదీ కొంత మందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ తో పెడుతున్నాడు. మెసం కాదా? అని అడుగుతున్నా. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తున్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి ఈయన మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ల ముగ్గుర్నీ బొక్కలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది. ఇదే వేరేవాడు చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేదా ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఇలాంటి ఫ్రాడ్ చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెట్టేవారు కాదా? వీళ్లు కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, టీవీ5 అసలు పట్టించుకోదు, అంతా వీళ్లే గజదొంగల ముఠా, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు.. అంతా వీళ్లే. ఎవడూ రాయడు, ఎవడూ చూపడు, ఎవడూ మాట్లాడడు. మరోవైపు పరిస్థితి చూస్తే, విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్య గోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పూర్తిగా అటకెక్కించేశారు. విద్యార్థులు ఈ రోజు నిజంగా తల్లడిల్లుతున్నారు. జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయ్యాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించా కూడా. డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. పిల్లలు చదువులు మానేస్తున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పరిస్థితి చూస్తే మా హయాంలో ప్రతి క్వార్టర్, క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే తర్వాతి క్వార్టర్ రాకముందే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్ తో ఆగిపోయింది. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది, అంతే. అక్కడ ఆగిపోయింది.. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్. ఒక్కో క్వార్టర్ కు ఉజ్జాయింపుగా 700 కోట్లు గవర్నమెంట్ కు ఖర్చవుతుంది. ఉజ్జాయింపుగా మొత్తం 5,600 కోట్లు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. 4,900 కోట్లు బకాయిలు. వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో రూ.1100 కోట్లు ఇచ్చేవాళ్లం. అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం.. పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేలు ఫీజురీయింబర్స్ మెంట్ కాకుండా ఇచ్చేవాళ్లం. పాలిటెక్నిక్ చదివే పిల్లలకు ఫీజురీయింబర్స్ మెంట్ కాకుండా రూ.15 వేలు ఇచ్చేవాళ్లం, ఐటీఐ చదివే వాళ్లకు సంవత్సరానికి 10 వేలు ఇచ్చేవాళ్లం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది, ఏప్రిల్ 2025 నాటికి రూ.2,200 కోట్లు బకాయిలు. విద్యాదీవెన బకాయిలు రూ.4,900 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు. రెండూ కలిపితే రూ.7,100 కోట్లు బకాయిలు. ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తున్నారు. మనం పిల్లలకు ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి చదువు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలిగి, వాళ్ల జీవితాలను మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ ను వాళ్ల చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం లేదు. చంద్రబాబు దగ్గరుండి పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్లు ఏరకంగా ఉన్నాయి అని చూస్తే.. ఈరోజు మీరు గమనించండి.. ప్రభుత్వ స్కూళ్లకు పోయేటప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు కట్టుకోని పోతున్నారు. ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడూ క్యారియర్ పెట్టుకుని పోతున్నాడు. ఎందుకు? అని అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతున్నాం అనే మాట వస్తోంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్లలో. 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ క్లాసులు నిలిచిపోయాయి. ఐబీ కథ దేవుడెరుగు.. ఇంగ్లీషు మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులిచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ హాస్టళ్లలో.. మీరంతా కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18, 19 నెలల చంద్రబాబు కాలంలో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయారు. ఇది రికార్డు. ఏయే స్కూళ్లలో చనిపోయారు, ఏయే ఆశ్రమ పాఠశాలలకు చెందిన పిల్లలు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు. పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం ఆశ్రమగిరిజన పాఠశాలలో జాండీస్ తో మృతి. కల్పన, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి. పార్వతీపురం మన్యం జిల్లా తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం, ఎర్రసామంత వలసలో జాండీస్ తో మృతి. పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. మండంగి కవిత (11), హడ్డుబంగి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో అనారోగ్యంతో మృతి. పార్వతీపురం మన్యం జిల్లా. పల్లవి (12) మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యంతో మృతి మోహన్ దాస్ (15), అవంతిక.. ఇలా 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఈ 18, 19 నెలల్లో చనిపోయిన పిల్లలు. నిజంగా కొన్ని వందల మంది పిల్లలు ఆస్పత్రులపాలయ్యారు. ఫుడ్ పాయిజన్, వాటర్ కంటామినేషన్ తో. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఇక్కడికి నేను కూడా వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించా. ఇటువంటి ఘటనలు ప్రతి రోజూ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయకు చెందిన పదో తరగతి విద్యార్థిని కటారి కరుణ (15) మృతి. గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం పెదతండాలో అంగన్వాడీ 5 మంది చిన్నారులకు అస్వస్థత. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థినులకు అస్వస్థత. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం బసివలస ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా బయటపడిన పురుగులు. వైయస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని భోజనంలో పురుగులు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు సోకి 40 మంది బాలికలకు అస్వస్థత. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన గ్రామ ఆశ్రమ పాఠశాలలో దుంపలకూర, పెరుగు తిన్న 29 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిపాలైన గిరిజన స్టూడెంట్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత, ఆహారం కలుషితమై 22 మందికి అస్వస్థత. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ 3లో విషతుల్య ఆహారం, 8 మంది చిన్నారులకు వాంతులు, విరోచనాలు, సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు, కూరగాయల్లో ఎలుకలు.. నలుగురు విద్యార్థినులకు అస్వస్థత. ఇదీ పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అన్నదానికి, పిల్లల పరిస్థితి, చదువుల పరిస్థితి ఏరకంగా ఉంది అని చెప్పడానికి కఠిన వాస్తవాలు ఇవి. (ప్రజెంటేషన్ చూపించారు) ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యం, లా అండ్ ఆర్డర్, ట్రాన్స్ పరెన్సీ, వ్యవసాయం.. ఇవే కదా చేయాల్సింది. అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే, ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి తప్పించుకోవడం, ఉన్నకాడికి స్కాములు చేయడం. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయాయి. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు రూ.300 కోట్లు అవుతుంది. 18 నెలలు ఇంటూ 300 కోట్లు అంటే రూ.5400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం.. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా మాట్లాడి, వాళ్లు కూడా స్ట్రైకులు చేస్తుంటే ఇచ్చింది ఎంత అని చూస్తే రూ.1800 కోట్లు. 3,600 కోట్ల బకాయిలు ఒక్క ఆరోగ్యశ్రీ బకాయిలు. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. వాళ్లు సమ్మె దిగిపోయేటప్పుడు వాళ్లకిచ్చిన మాటకు దిక్కులేదు. సమ్మె దింపేశారు, ఆ తర్వాత మాట కథ దేవుడెరుగు. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కాముగా మార్చేశారు. రూ.5 కోట్లు నెట్ వర్త్ లేని వాడికి ఇచ్చారు 104, 108 సేవలు. వాళ్ల తెలుగుదేశం ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడంట ఎవడో. కనుక్కోండి మీరే. స్కాము కాకపోతే రాయనన్నా రాయండి. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటాడు. అది ఇంకో డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కాముగా మారుస్తూ.. ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా.. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చాడు, అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. చూడండి ఇది. (జీవో చదివి వినిపించారు)