విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారు

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

151 అసెంబ్లీ, 22 ఎంపీలను  క్లీన్‌స్వీప్‌ చేశాం

ప్రజలు మన పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు

అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చూశాం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా క్లీన్‌స్వీప్ చేయాలి

 

అమరావతి: ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. తొమ్మిదేళ్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేశాం. ప్రజలు మన పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 151 అసెంబ్లీ,22 ఎంపీ స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ చేశామని చెప్పారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు వైయస్‌ జగన్‌ను శాసన సభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు దగ్గరై ప్రజల విశ్వాసాన్ని చురగొని ఈ రోజు అధికారంలోకి వచ్చాం. రాష్ట్రంలో 151 సీట్లు గెలవగలిగామంటే, 50 శాతం ఓటింగ్‌ మన పార్టీకి వచ్చిందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిందే.

అన్యాయం చేస్తే, అధర్మం చే స్తే దేవుడు ఏవిధంగా మొట్టికాయలు వేస్తారో చంద్రబాబును చూస్తే తెలుస్తోంది. మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను 23 మందిని చంద్రబాబు కొన్నారు. అదే సంఖ్యను ఇప్పుడు దేవుడు చంద్రబాబుకు ఇచ్చారు. ఎంపీల సంఖ్య మూడు..కరెక్ట్‌గా జరిగింది. అది కూడా మే 23వ తేదీ జరిగింది. ఇంతకన్న గొప్పగా బహుష ఏ స్క్రీప్ట్‌ కూడా ఉండదు. మనందరం కూడా గుర్తించుకోవాల్సింది ఒక్కటే..ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారు. వారి విశ్వాసాన్ని పొందాలి. మన టార్గెట్‌ 2024 ఎన్నికలే. ఇంతకన్న గొప్పగా మనం ఎన్నుకోబడాలి. ప్రజలు మనపై నమ్మకంతో ఓటు వేశారు. రేపు మనపై ఇలాగే ఓటు వేయాలంటే అంత గొప్పగా పని చేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేస్తాను. దేశంలో ఎప్పుడు జరగని విధంగా ప్రక్షాళన చేస్తాను .ఇందుకు మీ అందరి సహకారం, తోడు కావాలి. ఇంత గొప్ప విజయానికి మీ అందరి తోడుగా ఉన్నారు కాబట్టే జగన్‌ గెలిచారు. అందరిపై బాధ్యత ఉంది. కచ్చితంగా మంచి చేయాలన్న తపన, ఆలోచన ఉంది. ఆరు నెలల్లోగానే జగన్‌ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. మంచి చేసేందుకు దేవుడు నాకు మనసు, జ్ఞానం ఇవ్వాలని కోరారు. త్వరలోనే లోకల్‌ బాడీ ఎన్నికలు ఉన్నాయన్న విషయం మరిచిపోకూడదు. ఆ ఎన్నికల్లో కూడా క్లీన్‌స్వీప్‌ చేయాలి. 
 

తాజా వీడియోలు

Back to Top