సోదరీమణులందరికీ సెల్యూట్‌

మహిళలకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు 
 

హైదరాబాద్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరిమణులందరికీ సెల్యూట్‌ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘తల్లి, భార్య, కుమార్తె, సోదరికి నా సెల్యూట్‌.  మీ వల్లనే మేమంతా సంతోషంగా, మనశ్శాంతితో మంచి జీవితం గడుపుతున్నామని, మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం’  అని వైయ‌స్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Back to Top