తాడేపల్లి: ఫాదర్స్ డే సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్ మోడల్, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.