నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు.   

నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదం
నెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.  వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు  తెప్ప బోటులో  నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

Back to Top