సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన వైయ‌స్‌ జగన్ 

 తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్‌పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి  కలవరపరచే విషయం అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top