అన్నా..మా కూతురు పెళ్లికి రండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివాహా ఆహ్వానం ప‌త్రిక అంద‌జేసిన ఎమ్మెల్సీ దువ్వాడ‌

 తాడేప‌ల్లి:  త‌మ కుమార్తె వివాహానికి హాజ‌రు కావాల‌ని శ్రీ‌కాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వివాహా ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. గురువారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ దంప‌తులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. వ‌చ్చే నెల 11వ తేదీ త‌మ ప్ర‌థ‌మ పుత్రిక డాక్ట‌ర్ హైంద‌వి వివాహం తిరుమ‌ల‌లో ఏర్పాటు చేసిన‌ట్లు ఎమ్మెల్సీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు. 

టీటీడీ చైర్మ‌న్‌కు ఆహ్వానం ..
 ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ దంప‌తులు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి త‌మ కూత‌రు వివాహానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు.  తిరుమలలో ఫిబ్రవరి 11వ తారీఖున, టెక్కలి లో  ఫిబ్రవరి 23 వ తారీఖున జరగబోయే రిసెప్షన్ కు హాజ‌రు కావాల‌ని ఎమ్మెల్సీ దంప‌తులు ఆహ్వానించారు.

Back to Top