ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి  అండగా ఉంటాం 

మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెర‌డ్డిని దోషిగా ప్రచారం చేస్తోంద‌ని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఆయ‌న దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద‌రావు ప్రశ్నించారు. మిథున్‌రెడ్డి కుటుంబానికి మేమంతా అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్‌రెడ్డితో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ఎమ్మెల్యే విరూపాక్షి ములాఖ‌త్ అయ్యారు. అనంత‌రం  ధ‌ర్మాన ప్రసాద‌రావు మీడియాతో మాట్లాడుతూ.. `ప్రభుత్వం మిధున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది. కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించనంత వరకూ వ్యక్తిగానే చూడాలి. వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే ప్రత్యర్ధులకు కోపం ఉంటుంది. చార్జిషీటు వేయనివ్వడం లేదు` అని ధ‌ర్మాన‌ మండిపడ్డారు. 

Back to Top