మత్స్యకార కుటుంబాలకు మాజీ సీఎం వైయ‌స్ జగన్ భరోసా

ఈ నెల 14 న మంగళవారం  విశాఖ రానున్న వైయస్.జగన్ 

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు  ఓదార్పు

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ప్రకటన.

విశాఖపట్నం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కే కే రాజు.

మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం

సకాలంలో స్పందించడంలో విఫలమైన ప్రభుత్వం

ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు. 

విశాఖపట్నం: విశాఖపట్నం తీరంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం, అందులో ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో స్పందించని ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు మండిపడ్డారు. ఇప్పటికే ఈ దుర్ఘటనపై  స్పందించిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్వయంగా విశాఖపట్నం వస్తున్నారని తెలిపారు. జూలై 14, మంగళవారం ఉదయం వైయస్.జగన్  విశాఖ చేరుకుని, అక్కడ నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జబ్బర్ పేటకు వెళ్లి.. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన కారి చిన్నతో పాటు గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నట్టు  కే కే రాజు స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

ప్రభుత్వ సమన్వయ లోపం – 20 గంటల ఆలస్యం..

విశాఖపట్నం తీరప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకార సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఆ విషాదకరమైన సంఘటనలో 7 మంది ఉన్న ఆ బోటులో కాలి చిన్న అనే మత్స్యకార సోదరుడు మాత్రమే బయటపడ్డాడు. మిగతా 6 మందికి సంబంధించి ఆచూకీ కూడా ఇప్పటివరకు తెలియలేదు. ప్రభుత్వ యంత్రాంగం, త్రిసభ్య కమిటీ ఈ 6 మంది ఆచూకీని కూడా ఇంకా మేము కనుక్కునే పరిస్థితులు లేవు అని ప్రకటించి రెస్క్యూ ఆపరేషన్ కూడా నిలుపుదల చేయడం చాలా దురదృష్టకరం.

కేవలం విశాఖపట్నం తీరానికి 8 నాటికల్ మైల్స్ దూరంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తిగా వారిని రెస్క్యూ చేసి, మత్స్యకారుల్ని రక్షించడంలో గాని, ఆ సమాచారాన్ని త్వరితగతిన సంబంధిత డిపార్ట్‌మెంట్స్‌కి చేర్చడంలో గాని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కోస్ట్ గార్డ్,నేవీ,మెరైన్ పోలీస్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. వీరందరి మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉంది. సమన్వయ లోపంతో పాటు ఈ ప్రభుత్వ పెద్దలు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు ఆ కుటుంబాలు శోక సముద్రంలో మునిగి ఉన్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయాల్లో ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. ఇన్ని ఇంత నెట్‌వర్క్, ఇంత ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా, ఈ ప్రభుత్వం ఎక్కడైతే బోటు ప్రమాదం జరిగిందో, ఆ సమీప ప్రాంతానికి చేరుకోవడానికి 20 గంటల సమయం పట్టిందంటే అది చాలా విచారించదగ్గ విషయం.

బాధిత కుటుంబాల ఆక్రందన – మంత్రుల అపహాస్యం..

ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గల్లంతైన 6 కుటుంబాల్లో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న యువకులు, చిన్న పిల్లలతో ఉన్నవాళ్లు ఉన్నారు. ఈరోజు వాళ్లు బతికి ఉన్నారో లేదో తెలియక, గత 7 రోజులుగా తిండి తిప్పలు లేక, నిద్ర లేని రాత్రులు ఆ కుటుంబాలు గడుపుతా ఉన్నాయి. ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డ కారి చిన్న సుమారు 14-15 గంటలు సముద్రంలో పోరాటం చేసి, ఆ కెరటాలకు ఎదురీది, ఏదో ఒక మర్చెంట్ షిప్ ని పట్టుకుని తను బయటపడ్డాడు. కానీ, ఆ విషయంలో కూడా ప్రభుత్వం 'మేమే చిన్నాన్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చాం' అని ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇంత విచారించదగ్గ ఘటన జరిగినా, ఈరోజు వరకు ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, అన్ని శాఖల అధిపతి లోకేష్ గాని సక్రమంగా స్పందించకపోవడం దారుణం. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి దుర్ఘటన జరిగినా తన భుజస్కంధాలపై వేసుకునే హోమ్ మినిస్టర్ సైతం స్పందించలేదు. పైగా హోం మంత్రి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆమె నియోజకవర్గంలోనూ వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండి కూడా ఈ రోజు వరకు ఆమె ఆ బాధితుల్ని పరామర్శించిన పాపాన్ని పోలేదు. ఇక వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఇంత విషాద ఘటన జరిగిన తర్వాత కూడా కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. కోస్ట్ గార్డ్ ఒకటి చెప్తే, మెరైన్ పోలీసులు ఒకటి చెప్తారు, రెవెన్యూ యంత్రాంగం ఒకటి చెప్తుంది... ఇలా ఒక క్లారిటీ లేకుండా త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి గారిని పంపించి, కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు చెక్కులు తీసుకొచ్చి, వారి గోడు వినకుండా, ఏదో విదిలించినట్లు ఆ చెక్కులు ఇచ్చి వారు పారిపోవడం జరిగింది. బోటు డ్రైవర్ గా ఎంతో కాలం పనిచేసి, సొంతంగా వ్యాపారం చేసుకుందాం అని వడ్డీలకి డబ్బులు తెచ్చి బోటు కొనుక్కుంటే, ఆ బోటు మునిగిపోయింది. మొన్న జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ చిన్న చెప్తున్న మాటలు వింటే చాలా విషాదం వేసింది. 'నేను ఎందుకు బ్రతికున్నాను, వాళ్లతో పాటు ఆ దేవుడు నన్ను కూడా తీసుకోకపోతే బాగుండు' అని మాట్లాడేంత దీన స్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.

వైయస్.జగన్ స్పందిస్తేనే ప్రభుత్వంలో కదిలిక... 

ఈ రోజు ఈ ప్రభుత్వ పరిస్థితులు చూస్తే... ఒక రైతుకి కష్టం వస్తే వైయస్.జగన్ స్పందిస్తే తప్ప ఈ ప్రభుత్వం భరోసానిచ్చే పరిస్థితి లేదు. ఒక కార్మికుడికి కష్టం వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైయస్. జగన్ స్పందిస్తే తప్ప ఈ ప్రభుత్వం కదలడం లేదు. ఈ రాష్ట్రంలో రౌడీ షీటర్ పేరుతోనో, లేకపోతే ఏదో కేసులు ఉన్నాయనో ఒక వ్యక్తిని లాకప్‌లో చంపి, కాల్చి బూడిద చేస్తే, ప్రతిపక్ష నాయకుడు వైయస్.జగన్ స్పందిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు. నిరుద్యోగ యువత సమస్యలపై వైయస్. జగన్టచ్ చేస్తే తప్ప ఈ ప్రభుత్వం చూసే పరిస్థితి లేదు. హాస్పిటల్ నిర్వహణకు సంబంధించి, ప్రజా ఆరోగ్యానికి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జగన్స్పందిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు.

బాధితులకు వైఎస్సార్‌సీపీ అండ – వైయస్.జగన్ పర్యటన..

వైయస్.జగన్ ఒక గొప్ప మానవతావాది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజల కష్టాల్ని నెరవేర్చడం కోసం ఆయన మొదటి నుంచి పాటుపడుతున్నారు. అదే విధంగా, ఈ బోటు ప్రమాద దుర్ఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఆ రోజే ఆయన స్పందించారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభ్యర్థించారు. ప్రాపర్ గా రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మా పార్టీ శ్రేణులను సైతం తక్షణం వెళ్లి ప్రభుత్వం పైన, స్థానిక యంత్రాంగంపై మీరు ఒత్తిడి తీసుకురండి, ఏ విధంగా అయినా సరే ఆ గల్లంతైన వారిని రక్షించే ప్రయత్నం చేయమని చెప్పారు.మేము కూడా వైయస్. జగన్ ఆదేశాల మేరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా హార్బర్ కి వెళ్లాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఆ రోజు ఆ కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాం. కానీ ప్రయోజనం లేదు. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా వాళ్ల ఆచూకి లభించలేదు.

మళ్ళీ వెంటనే జగన్ గారు స్పందించి,  కారి చిన్నతో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. అతను చెప్పిన మాటలు, అతని కష్టం, ఆవేదన విని వైయస్. జగన్ చలించిపోయారు. నేను వస్తాను, మీకు అండగా ఉంటాం, ఇది రాజకీయాల కోసం కాదు, మానవతా దృక్పదంతో మీకు జరిగిన నష్టాన్ని పూడ్చే వరకు ఈ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం' అని  మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి, రేపు 14 వ తారీఖున మంగళవారం నాడు విశాఖ వస్తున్నారు. 11 గంటల ప్రాంతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న జబ్బర్ పేటలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారిని కలిసి ఓదార్చడం జరుగుతుంది. అదే విధంగా, అదృష్టవశాత్తు బతికి బట్టకట్టిన కారి చిన్నను, చిన్న కుటుంబ సభ్యులను కూడా ఆ రోజు జగన్  గారు కలిసి ఓదార్చుతారు.

విశాఖపట్నం జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు వేరు. విశాఖపట్నం జిల్లా అనేది 97 శాతం పూర్తిగా అర్బన్ ప్రాంతం. ఇక్కడున్న 20 లక్షల మంది ఓటర్లలో కూడా వారి ఆర్థిక స్థితిగతులు, ఉపాధి, ఉద్యోగ రీత్యా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రతి సంవత్సరం మారే పరిస్థితులు ఉంటాయి. అందరూ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ప్రజలే ఎక్కువ. అద్దెలు కట్టలేకో, పిల్లల చదువుల కోసమో కాన్స్టెన్సీలు మారుతుంటారు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని గతంలో కూడా కలిసి ఒక రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో ఇక్కడ సమగ్రంగా, సమర్ధవంతంగా అధికార యంత్రాంగం నిర్వహించలేకపోయింది. క్షేత్రస్థాయిలో ఐడెంటిఫికేషన్ ప్రాపర్ గా జరగలేదు. దీన్ని పరిగణలోకి తీసుకుని, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కనీసం ఒక 10 రోజులు ఓటర్ల వెరిఫికేషన్ దరఖాస్తుల పంపిణీకి సమయం ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు.

Back to Top