మా ఓట్లు కూడా వాళ్లే వేసుకున్నారు

మా గ్రామంలో 600 ఓట్లకు 300 మంది గూండాలను మోహరించారు

ఎంపీ అవినాష్‌రెడ్డికి మొర‌పెట్టుకున్న అచ్చివెల్లి గ్రామ‌స్తులు

వైయ‌స్ఆర్ జిల్లా:  అన్నా..మా ఓట్లు కూడా టీడీపీ వాళ్లే రిగ్గింగ్ చేసి వేసుకున్నారు. మ‌మ్మ‌ల్ని పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు కూడా వెళ్ల‌కుండా బెదిరించారు అంటూ అచ్చివెల్లి గ్రామ‌స్తులు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డికి మొర‌పెట్టుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతల దౌర్జన్య కాండను అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. తమను ఓటువు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారన్నారు.  
 
కత్తులు, కర్రలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్‌ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు. వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామంలోకి వచ్చిన వారేని వారు ఎంపీ అవినాష్‌కు తెలిపారు. 

తమ గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గూండాలను మోహరించారన్నారు. తమ ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి దౌర్జన్యాఉ జరగలేదని,  మహిళలను కూడా చూడకుండా తమను బూతులు తిట్టారని, చంపుతామని బెదిరించారరని అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌కు స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కొనివ్వలేదని ఎంపీ అవినాష్ రెడ్డి వ‌ద్ద కనంపల్లి గ్రామస్తులు వాపోయారు. బయట ప్రాంతం నుండి వచ్చిన వారితో ఓట్లు వేయించార‌ని ఫిర్యాదు చేశారు.

కేంద్ర బలగాలతో రీ పోలింగ్‌ నిర్వహించాలి
దీనిపై ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పులివెందులపై పోలీసులు పగబట్టారని మండిపడ్డారు.  కార్యకర్తలు సంయమనం పాటించాలని, పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందామని అవినాష్‌ పేర్కొన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారని, ఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర బలగాలతో రీపొలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top