మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
ఎల్లో మీడియా గొట్టాల గోల..టీడీపీ నేతల తిట్లు ఏంటి?
03 May 2019 4:23 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
అమరావతి : ఫొని తుపాను సహాయ పనులు చంద్రబాబు నాయుడుకు సంబంధం లేకుండానే జరుగుతుండటంతో ఎల్లో మీడియా ప్రభుత్వ యంత్రాంగంపై బురద చల్లే వార్తలు కుమ్మరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తూ, టీడీపీ కార్యకర్తలతో తిట్టిస్తున్నారని ట్విటర్లో ధ్వజమెత్తారు.
'తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు. ఫొని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. ఫొని బీభత్సం వల్ల ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. ఎటువంటి ప్రచార హడావుడి లేకుండా మూడు రోజులుగా అవిశ్రాంతంగా కష్టపడ్డారు. విద్యుత్ పునరుద్ధరణ, మంచినీటి సరఫరా అందజేసి ప్రజలు ఎవరిళ్లకు వారు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఓటమి ఫిక్సయి దిగిపోయే ముందు, పదవిపై అతిగా ఆశలు పెట్టుకున్న నాయకుడు- కోడ్ అమలులో ఉండగా సీఎస్తో పెట్టుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ మంచి పేరు తెచ్చుకున్నట్ట చరిత్రలో లేదు. ఉత్సవ విగ్రహాల హోదా కూడా కాదు. గోడపైన క్యాలెండర్ ఫోటో స్థాయే' అని ట్విటర్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.