అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న అనంతపురంలో జరగనున్న “బీసీ గళం” సభకు సంబంధించిన పోస్టర్లను ఉరవకొండ, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో బుధవారం ఆవిష్కరించారు. ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోకుల పుల్లయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, జిల్లా కార్యదర్శి గోవిందు, తాలూకా అధ్యక్షుడు డిష్ సురేష్, రూరల్ అధ్యక్షుడు ధనుంజయ, టౌన్ అధ్యక్షుడు జోగి హనుమంతు తదితరులు పాల్గొని పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఈనెల 26వ తేదీ ఆదివారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో ఉదయం 10 గంటలకు “బీసీ గళం” సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు చెందిన బీసీ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, వాటి అమలుకు డిమాండ్ చేయడానికి ఈ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు మండలాల నుంచి భారీ ఎత్తున బీసీ సోదరులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డే ఆంజనేయులు, రామకృష్ణ, భీమా సుధాకర్, నీలప్ప, మాబు రామాంజనేయులు, మహానంది, ఇంద్రావతి, సురేష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం: బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజి, మండల కన్వీనర్ సూరి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, జనరల్ సెక్రటరీ గోగుల పుల్లయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఉపాధ్యక్షుడు కిష్టప్ప, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే “బీసీ గళం” సభను విజయవంతం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.