చంద్రబాబుపై చర్యలు తీసుకోండి

ఈవీఎంల నెపంతో ఓటర్లను తప్పుదోవపట్టిస్తున్నాడు

దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలి

ఈసీకి ఫిర్యాదు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలు నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ

విజయవాడ: ఈవీఎంలు పనిచేయడం లేదని చంద్రబాబు పుకార్లు పుట్టిస్తున్నారని, ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. 319 ఈవీఎంలలో తలెత్తిన సమస్య పరిష్కరించారని, కేవలం 25 ఈవీఎంలు కొద్దిగా సమస్య ఉన్నాయని అవి కూడా సరిచేస్తామని ద్వివేది చెప్పారన్నారు. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఈవీఎంలు పనిచేయడం లేదని, టీడీపీకి ఓటు వేస్తే వైయస్‌ఆర్‌ సీపీకి వెళ్తుందని చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారని, ఒక రకంగా పోలింగ్‌ జరగకుండా ఉండేందుకు ఈవీఎంలు పనిచేయడం లేదని ఓటర్లు పోలింగ్‌ దగ్గరకు వెళాల్సిన అవసరం లేదనే అపోహను చంద్రబాబు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఓటర్లలో చైతన్యం చూసి చంద్రబాబు చేతులు ఎత్తేశారన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, చంద్రబాబు మాటలు నమ్మి, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు నమ్మి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు.  

బాబే రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నాడు: నాగిరెడ్డి

చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. ఈవీఎంలు పనిచేయడం లేదని ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 46120 పోలింగ్‌ బూతులలో 96,240 ఈవీఎంలు పెట్టారన్నారు. 344 ఈవీఎంలపై ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల అధికారి చెప్పారన్నారు. 30 శాతం పనిచేయడం లేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కానీ 0.37 శాతం పనిచేయడం లేదని, వాటిని కూడా సరిచేస్తున్నారన్నారు. ఓటింగ్‌కు క్యూలు కట్టిన ప్రజలను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పోలీసుల బందోబస్తు పటిష్టంగా లేదన్నారు. పోలింగ్‌ బూత్‌లలో అంగన్‌వాడీ టీచర్లను పెట్టారని అందుకే ఓటింగ్‌ స్పీడ్‌గా జరగడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. 

ఏలూరులో ఎమ్మెల్యే బుజ్జి ఒక రౌడీ షీటర్‌ను పక్కనబెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీటీసీ మట్టా రాజుపై దాడి చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వారిపై కేసులు కూడా పెట్టలేదన్నారు. రాప్తాడు, మడకశిర, జమ్మలమడుగు, జీడీ నెల్లూరులోని రెండు బూతులలో రిగ్గింగ్‌ జరుగుతుంది. నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేశారని ఈసీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. 

Back to Top