గ్రామస్తులతో మమేకమైన శ్రీకాంత్ రెడ్డి 

రాయ‌చోటి:  రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న నాయకులకు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమైన శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామస్థులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వైయ‌స్ఆర్‌సీపీకి గ్రామస్థాయిలో మంచి ఆదరణ ఉందని, కార్యకర్తల కృషితో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాసన వెంకటరమణ, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాబు, మాజీ సర్పంచ్‌లు వెంకట సుబ్బారెడ్డి, కృష్ణయ్య, వెంకట్రామిరెడ్డి, నాయకులు గజేంద్ర రెడ్డి, సూరం వెంకటసుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సగినాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top