వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌కు అండ‌గా సోష‌ల్ మీడియా

మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య చేతుల మీదుగా రూ.3 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం అంద‌జేత‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  తీవ్ర అనారోగ్యంతో బాధ్య‌ప‌డుతున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం అండ‌గా నిలిచింది. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.3 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయాన్నిఅంద‌జేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.  క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం కుందుర్పి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఎస్ హనుమంతరాయుడు గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. వైద్య‌ఖ‌ర్చుల‌కు ఇబ్బందులు ప‌డుతుండ‌గా వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌లు ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. రూ.3 ల‌క్ష‌ల విరాళాలు సేక‌రించి శ‌నివారం మాజీ ఎంపీ, కళ్యాణదుర్గంవైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. విరాళాల సేకరణలో కీలకపాత్ర పోషించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కైరేవు మహాలింగ, గురు మందల, సాయినాథ్, గొర్ల కృష్ణ తదితరులను తలారి రంగయ్య అభినందించారు.  పార్టీ కార్యకర్తకు ఆపద వస్తే... కుటుంబ సభ్యుల్లాగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా స్పందించిన తీరు అద్భుతమని తలారి రంగయ్య అన్నారు. కార్యక్రమంలో కుందుర్పి, శెట్టూరు మండలాల కన్వీనర్లు హనుమంతరాయుడు,  ఎంఎస్‌ హనుమంతరాయుడు, సర్పంచ్ వన్నూర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Back to Top