లోకేష్‌..మీ తండ్రి, తాత నేర్పించిన భాష ఇదేనా?

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డి

చంద్రబాబు లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలాడు

ఆంధ్రప్రదేశ్‌ అని రాయడం రాని లోకేష్‌ మాట్లాడటం విడ్డూరం

తండ్రీ కొడుకులు ఇద్దరూ ఏదైన సబ్జెక్ట్‌లో 35 మార్కులు తెచ్చుకోగలరా?

వైయస్‌ జగన్‌ సింహం..లోకేష్‌ గ్రామ సింహం

తాడేపల్లి:  టీడీపీ నేత నారా లోకేష్‌ భాష, బాడీ లాంగ్వేజ్‌ చూసి జనాలు అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాయడం, మాట్లాడటం రాని వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఉండటం బాధాకరమన్నారు.  ఏం పీకుతారు..ఉచ్చ పోయిస్తా..అని లోకేష్‌ మాట్లాడుతున్నాడు..ఇవేనా మీ తండ్రి చంద్రబాబు, మీ తాత నీకు నేర్పించిందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివశంకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 ఎన్టీఆర్ సింబల్..బాబు సింబల్.. లోకేశ్ సింబల్
        తనది ఎన్టీఆర్ గొంతు అని లోకేశ్ అంటున్నాడు. మాట్లాడితే ఎన్టీఆర్ వారసుడ్ని అంటాడు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ బాడీ లాంగ్వేజి ఏంటి..? ఎన్టీఆర్ లాంగ్వేజ్ ఏంటి.. నీ లాంగ్వేజ్ ఏంటి..?. అసలు ఎక్కడైనా పోలిక ఉందా..?
- తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చేతిని సూటిగా చూపిస్తారు ఎన్టీఆర్..  మరి నీ తండ్రి చంద్రబాబు రెండువేళ్లూ ఊపుతూ చూపితే అది ఊళ్ళల్లో చెప్పినట్టు లండన్(బాత్ రూమ్) కు వెళ్లొస్తా... అన్నట్లుగా ఉంటుంది
- నీ స్థాయి అంత కన్నా కిందికి దిగజారి చేతిని అలా ఇలా అని అసభ్యంగా ఊపుతూ ... దిక్కుమాలిన సంజ్ఞలు చేయడం చూస్తే జనం ఛీదరించుకుంటున్నారు...ఏంటీ వెర్రితనం..పిచ్చితనం లోకేశ్? 
- జగన్‌ గారిని ఏకవచనంతో సంబోధించడం, మూత్ర విసర్జన రానోళ్లకు చేయిస్తానన్నట్లుగా నీవు మాట్లాడడం చూస్తుంటే... స్టాన్ ఫర్డ్ లో నీవు నేర్చుకున్న చదువు ఇదేనా? ఇదేనా, నీ తండ్రి బాబు నీకు నేర్పిన సంస్కారం? జనం నవ్విపోతారన్న సిగ్గన్నా మీకు లేదా? . డెంగ్యూ అని పలకడం రాక బూతులు పలికే నీవు చదువు గురించి, సంస్కారం గురించి మాట్లాడతావా..?

బాబ్బాబు అని అడుక్కుంటున్నా జనం రావడం లేదుః
        ఏదైనా ఒక ప్రాజెక్టును కట్టాలంటే వందల జేసీబీలు, వందల కొద్దీ ప్రొక్లయిన్లు, లారీలను, భారీ పరికరాలను తెచ్చి పూర్తి చేస్తారు. దీనికి భిన్నంగా... ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్‌ అనే వెర్రిమాలోకం ఉరఫ్‌ యువ‘గంగాళం’ అనే ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది... ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, ఒకవైపు టీడీపీ, మరోవైపు ఎల్లోమీడియా జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తోంది. మీరెంత లేపినా,  యువ‘గంగాళం’  ప్రాజెక్టు పైకి లేవదు...  ఎన్నటికీ పూర్తి కానేకాదు. అది అంత అసమర్థ ప్రాజెక్టు అని జనమే తేల్చేశారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో జనాన్ని రప్పించాలని రండి బాబూ రండి...అని ఎంతగా బతిమాలి బామాలినా పాదయాత్రలో లోకేశ్‌ వెంట నడవం గాక నడవం...అంటూ జనం ఆ యాత్రకు రానే రావడం లేదు. 
- జనం రావడం లేదన్న నిరాశలో ఇష్టమొచ్చినట్లు పేట్రేగిపోతున్నావు... నీ పాదయాత్రను పట్టించుకునే వారే లేరన్న నిరాశలో జగన్‌గారిపై విమర్శలు చేస్తున్నావు. ఒక తాగుబోతు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలడు. 
- జగన్‌ గారి పాదయాత్ర చూసి కాపీ కొడితే... పులిని చూసి వాతలు పెట్టుకుంటే ఏం అవుతుందే.. అదే శాస్తి జరుగుతుందని లోకేశ్ గుర్తించాలి.

లోకేశ్ చదివింది స్విమ్మింగ్‌ఫూల్‌ యూనివర్సిటీలో...
        40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 74 ఏళ్ళ వయసులో, రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శలకు దిగజారాడు... ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుగా తన  తనయుడు లోకేశ్‌ ను  వ్యక్తిగత విమర్శల నుంచి బూతులు నేర్పి మరీ జనంపైకి వదిలాడు. 
-  ఈ వెర్రోడు జగన్‌ గారి చదువు గురించి మాట్లాడేంతటి స్థాయికి వెళ్లిపోయాడు... లోకేశ్ మాటలు, చేష్టలు చూస్తుంటే.. అతను స్టాన్‌ఫర్డ్‌ కాదు స్విమ్మింగ్‌ఫూల్‌ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఉన్నాడు...
- నీవు చదివిన చదువు ఏంటి? ఎవరి సౌజన్యంతో నువ్వు చదువుకున్నావ్?. సత్యం రామలింగరాజు ఆర్థిక సహకారంతో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివావని చెబుతావు. నీ చదువు ...నీ వ్యవహారశైలి ...నీ హావభావ విన్యాసాలు ...ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఎంతగా అఘోరించాయో,  నీ భాషా సంస్కారమే చెబుతోంది.  స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో నీతో చదువుకున్న నలుగురి పేర్లు అయినా చెప్పగలవా లోకేశ్? నువ్వు చదివింది స్టాన్‌ఫర్డ్‌ కాదు స్విమ్మింగ్‌ ఫూల్‌ విశ్వవిద్యాలయంలో అన్నట్లుగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ అని రాయలేని లోకేశ్..
        కొడుక్కి అక్షరాభ్యాసం చేయించే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అని రాయించడం చేతకాని నువ్వా జగన్‌ గారి చదువు గురించి ప్రశ్నించేది?.  తండ్రి ఎస్వీయూలో ఎకనామిక్స్‌ చదివానంటాడు..తనయుడేమో స్టాన్‌ఫర్డ్‌లో చదివానంటున్నారు కదా... మీ ఇద్దరికి ఇంటర్మీడియేట్ లో ఏ సబ్జెక్టులో అయినా ఒక పరీక్ష పెడదాం... ఇంటర్‌లో కనీస పాస్‌ మార్కులు తెచ్చుకోండి చూద్దాం, మీ ఇద్దరు విద్యావంతులేనని ఒప్పుకుంటాం...

Back to Top