టీడీపీకి మంగ‌ళ‌గిరిలో షాక్‌

రేవేంద్ర‌పాడులో 250 మంది టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ గూటికి

సాద‌రంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

గుంటూరు:  ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీకి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద షాక్ త‌గిలింది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి నియోజవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామం నుంచి 250 మంది యువత టిడిపిని వీడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో  వైయ‌స్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. వీరికి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి ప‌నుల‌కు ఆక‌ర్శితులై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లు వారు తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అదేవిధంగా రాజకీయంగా బీసీలకు ఇస్తున్న ప్రోత్సాహానికి, మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వాళ్ళు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బీసీలకు గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు వేస్తున్న పెద్దపీట చిరస్థాయిగా నిలిచిపోతుంది అని, తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రేవేంద్రపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క సోదరుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ.....ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం మరియు రాజకీయంగా వారి ఎదుగుదలకు బంగారు బాట నిర్మింపబడుతుందని పేర్కొన్నారు. 
బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు బీసీలు అంటే వెన్నుముక లాంటి వారని నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఈ రాష్ట్రంలో  పరిపాలన నడుస్తుందని...అనునిత్యం అణగారిన వర్గాల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అన్నారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్క సోదరుడికి అన్నివేళలా తాను మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లు అండగా ఉంటామని నియోజవర్గ అభివృద్ధిలో ఇకనుంచి మీరందరూ కూడా భాగస్వాములను వారితో అన్నారు..

 పార్టీలో చేరిన వారిలో:

హరి బాజీ గౌడ్ , మరీదు గోపీ, జంపన జనార్ధన్, బొమ్మినేని సతీష్, మోతుకురి గోపీ, శశి, వాకా ప్రసాద, ఇజ్జిగని వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసన్న కుమార్ , షేక్ కాసిం , కొప్పుల రమేష్ , షేక్ నాగుర్ వలి , ఇజ్జిగాని సతీష్ , సాయి ప్రకాష్ , ఇజ్జీగాని కోటి , సాయి కృష్ణ మరియు సుమారు 100 కుటుంబాల  తొ పాటు......

 కార్యక్రమంలో దుగ్గిరాల ఎంపిపి దానబోయిన సంతోష రుపవాణి, జడ్పిటిసి మేకతోటి అరుణ , మరియు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లోకేష్‌కు వ‌రుస షాక్‌లు..
 టీడీపీ నేత నారా లోకేష్‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి.  ఆ పార్టీ కీల‌క నేత  గంజి చిరంజీవి టీడీపీ వీడి ఇటీవ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  టీడీపీలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి లోకేష్ వైఖ‌రి న‌చ్చ‌క టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.  ఆయ‌న పార్టీ వీడే స‌మ‌యంలో సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.  అలాగే మ‌రికొంత మంది క్రీయాశీల నేత‌లు, మ‌హిళా నాయ‌కురాళ్లు ఇటీవ‌ల టీడీపీని వీడి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో టీడీపీ శిబిరంలో గుబులు పుట్టుకుంది.  

Back to Top