వైయ‌స్ జగన్ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు

 వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ట్వీట్ 
 

తాడేప‌ల్లి: కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావులేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగుతున్న సీఎం వైయ‌స్‌ జగన్ కు ప్రజాదరణ పెరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జగన్ పాలనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారూ... వయసుతో పాటు మీ మెదడు ఎంత కుళ్లిపోయిందో అర్థం కావడం లేదా? అని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు.

"మీది పచ్చి రాజకీయ స్వార్థం కాదా? చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులు గానూ, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి లబ్ది పొందాలనుకోవడం లేదా? ఏదో రకంగా చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా?" అంటూ సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top