కౌంటింగ్‌ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టుసాధించే ప్రయత్నం చేశారు

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు

ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారు

దేశంలో ఎక్కడా లేని నిబంధనలు కేవలం ఏపీలో మాత్రమే పెట్టారు

దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన

కౌంటింగ్‌ ఏజెంట్లకు పార్టీ నేతల దిశానిర్దేశం

  తాడేపల్లి: కౌంటింగ్‌ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లతో వైయస్‌ఆర్‌సీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారు.  చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్‌ పూర్తై డిక్లరేషన్‌ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల పేర్కొన్నారు.

 తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.. ఎన్డీఏతో పొత్తు పెట్టుకునప్పటి నుండి ఈసీ ద్వారా అధికారులపై వత్తిడి తెచ్చారు.. ఎవరెన్ని పాచికలు విసిరినా వైయ‌స్ఆర్‌సీపీ  ముందు అవి పారవు . వైయ‌స్ఆర్‌సీపీ బలమైన పార్టీ.. బలమైన మెజారిటీతో గెలుస్తున్నాం.. టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ ఒక్క రోజు వరకే.. చంద్రబాబుకి పిక్చర్ తెలుసు కనుక గుమ్మనంగా ఉన్నాడు.. లోకేష్ అయితే అసలు అడ్రెస్స్ లేడు అంటూ ఎద్దేవా చేశారు.

 జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు బీజేపీ కోసం ఎన్డీఏ వైపు ఇచ్చాయి.. ఎన్డీఏకు 400 చూపించడం కోసం ఆ సంస్థలు అలా సెట్ చేశారు.. వాళ్లు ఇచ్చిన ఫిగర్స్ చూసి జనం నవ్వుకుంటున్నారు అని సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, కౌంటింగ్ కి అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నాం.. అందరికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాం.. కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరూ కేంద్రాల నుండి బయటకి రావద్దని చెప్పామన్నారు. రేపు 11 గంటలకు సంబరాలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఇష్యూపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు కొట్టేసినా ఎన్నికల కమిషన్‌ చేసింది తప్పే అని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.....

 • - వైయస్ఆర్‌సీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించబోతోంది.
 • - వైయస్ జగన్ గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
 • - కౌంటింగ్ కు సంబంధించి ప్రత్యేక పరిస్దితుల దృష్ట్యా పార్టీ కౌంటింగ్ ఏజంట్లందరూ అప్రమత్తంగా ఉండాలి.
 • - ఇప్పటికే మా కౌంటింగ్ ఏజంట్లందరికి వర్క్ షాప్ లో ఓరియంటేషన్ చేశాం.
 • - వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా పాజిటివ్ గా పార్టీ అకౌంట్ లో పడేవిధంగా జాగ్రత్త వహించాలి.
 • - కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేవరకు కూడా అక్కడ నుంచి ఎవర్ని కదలద్దని చెప్పాం.
 • - పార్టీ శ్రేణులన్నీ కూడా అందుకు సిధ్దంగా ఉన్నాయి. రేపు 10.30 గంటలకు రాష్ర్టం అంతా సెలబ్రేషన్స్ కు సిధ్దంగా ఉండాలని అల్రేడీ పిలుపు ఇచ్చాం.
 • - ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసినా జరగబోయేది వాస్తవం.పార్టీ శ్రేణులకు సందేశం పంపించాం.
 • - పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టు కొట్టేసినంతమాత్రానా వాళ్ళు చేసింది తప్పు తప్పు కాకుండా పోదు.
 • - కామన్స్ సెన్స్ పాయింట్ ఆ విషయం చిన్నపిల్లలను అడిగినా చెబుతారు.
 • - పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసి ఒక రూల్ ఫిక్స్ చేసింది.అటెస్ట్ చేసిన అధికారి సీల్ రూపంలో గాని లేదా డిటెయిల్స్ పెన్ తో రాసిగాని ఉండాలని చెప్పారు.
 • - ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని పనిచేసిన వివరాలు తెలియకుండా సంతకం ఉంటే అది ఎవరి సంతకమో కూడా తెలియదు.
 • - ఇది లాస్ట్ జులై విడుదలైన ఈసి గైడ్ లైన్స్ లో ఉన్నది.దానికి విరుధ్దంగా దాన్ని ఛేంజ్ చేయకుండా దేశం అంతా కాకుండా ఏపిలో మాత్రం సంతకం ఉంటే చాలని రూల్ పెట్టారు.
 • - అది కూడా టిడిపి వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే చాలని రిక్వెస్ట్ చేశాక అది మార్చారు.దాంట్లో క్లియర్ వయోలేషన్ కనిపిస్తోంది.అది కూడా పోలింగ్ అయిపోయాక నిర్ణయం తీసుకున్నారు.
 • - పోని పోలింగ్ కు ముందు ఒక నిర్ణయం తీసుకుని అది దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే సరే.కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో అది కూడా ఏపిలో అమలు చేస్తుంటే  విడ్డూరంగా కనపడుతోంది.అనుమానస్పదంగా కూడా ఉంది.
 • - అందుకనే ఇష్యూ రెయిజ్ చేశాం. కోర్టు దానిలో జోక్యం చేసుకోమని చెప్పింది.ఈసి,కోర్టు ఇండిపెండెంట్ వ్యవస్ధలు అయినా రాజకీయపార్టీగా మాకున్న హక్కు వాడుకున్నాం.
 • - చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేయగలను అని... నా శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడియిజం చేసి అందర్ని భయపెడతాడో సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం చేశారు.
 • - కూటమిగా పొత్తు పెట్టుకున్నప్పటినుంచి గత రెండు నెలలుగా జరిగిందంతా మీరంతా చూస్తున్నారు.
 • - ఎన్నికల కోడ్ వచ్చినప్పటినుంచి అధికారుల బదిలీల్లో గాని,అడ్డగోలు గా తాత్కాలికంగా అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలలో అది కనపడింది.
 • - అన్నింటిలో తన ప్రభావం ఉందని చూపుతూ అధికార యంత్రాంగంపై పట్టుసాధించే ప్రయత్నం చేశారు. 
 • - అవన్నీ కూడా ఇక్కడకు వచ్చేసరికి పాచికలు పారవు.అలాంటివి అతనిని నమ్ముకున్నవారికి సైకాలిజికల్ గా ఆనందాన్ని ఇవ్వచ్చు.
 • - అధికారులలో కూడా చంద్రబాబుకు కొందరు భయపడి ప్రవర్తించేందుకు అవకాశం ఉంది.
 • - చంద్రబాబు బిజేపితో పొత్తుపెట్టుకోవడం,ఈసిపై పట్టుబిగించడం,ఈసి కూడా ఆయన వత్తిడి తెస్తే వాటికి తలొగ్గడం ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది.
 • - నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు.
 • - వైయస్ఆర్‌సీపీ  బలమైన పార్టీ రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు.
 • - ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉన్నాం.
 • - గత ఎన్నికల సమయంలో సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
 • - హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.అందుకే సైలెంట్ గా ఉన్నారు.గుంభనగా ఉన్నారు.దానికి మెంటల్ గా ప్రపేర్ అయ్యారు.
 • - లోకేష్ దేశంలో ఉన్నట్లుగా లేరు.ఈరోజు వచ్చారేమో నాకు తెలియదు.
 • - ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ దారుణంగా ఉంది.హాస్యాస్పదంగా ఉంది.
 • - ఒక ఎగ్జిట్ పోల్ చూస్తే హాస్యాస్పదంగా ఉంది.  21 సీట్లలో పోటీ చేసిన జన సేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వచ్చింది.పొంతన లేని లెక్కలుగా కనిపిస్తున్నాయి.
 • - పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.రేపు ఉదయం 9 గంటలకల్లా టిడిపి దుకాణం బంద్ అయిపోతుంది.
 • - బిజేపి స్టాటజీలో పార్ట్ గా సౌత్ లో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది.సైకాలజికల్ దీనిలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ లో ఆ ప్రభావం కనిపిస్తోంది.
 • - సౌత్ లో  సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నట్లుగా కనిపిస్తోంది.
 • - మేము జనంతో ఉన్నాం. జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.
 • - ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.
 • - చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు.స్పందనే లేదు.
 • - ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టిడిపి నేతలు లేనిపోని అసత్యాలు ప్రచారం చేసారు.
Back to Top