శ్రీకాకుళం: రానున్నది ఎన్నికల కాలం. అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. దొంగ హామీలతో చంద్రబాబు అండ్ కో ఇటుగా వస్తారు. వారు ఇచ్చే అబద్ధపు హామీలను నమ్మవద్దు అని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. వాటిని తిప్పికొట్టి, మేలైన పాలన మనం ఏ విధంగా అందించాం అన్నది ప్రజలకు చెప్పగలగాలి. వాటిపై మీ అందరూ మాట్లాడగలగాలి. సంబంధిత అవగాహన వారిలో కల్పించగలగాలి. బాధ్యతాయుతం అయిన రాజకీయ కార్యకర్తలు చేయాల్సిన పని ఇది. ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నిత్యావసరాలు ధరలు పెరిగాయి అంటున్నారే..అది నిజం కాదు. ఏ రాష్ట్రంలో అయినా మన కన్నా తక్కువకు నిత్యావసరాలు దొరుకుతున్నాయో చెప్పమని సంబంధిత విపక్ష నాయకులను నిలదీయండి. అలానే ప్రజలకు మనం ఏం చేశామో వివరిస్తూ వెళ్లండి. జీఎల్ ఫంక్షన్ హాల్ లో చింతాడ,తండేంవలస,శిలగాం-సింగువలస, అలికాం,పొన్నాం, నవనంబాడు, గేదెలవానిపేట, భైరివానిపేట, నైర, బట్టేరు, లంకాం, గూడెం పంచాయతీలకు చెందిన పార్టీ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. ఎన్నికల వేళ ప్రతి బూత్ కో ఆర్డినేటర్ శ్రద్ధతో పని చేయాలి. కొన్ని మీడియా సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నా యి. వాటిని పట్టించుకోనవసరం లేదు. వారు అనుకునే పార్టీ అధికారంలోకి వస్తే..ఈ రోజు ప్రజలకు అందుతున్నవి వాటి ఖాతా ల్లోకి వెళ్తాయి. ఈ రోజు అన్ని కుటుంబాలూ హాయిగా జీవిస్తు న్నాయి. అది మన ప్రభుత్వం సాధించిన ఘనతే.. ఈ రోజు నుంచి అవ్వాతాతలకు 3 వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఈ రోజు ఇచ్చిన మాట ని లబెట్టుకున్నాం. 5 ఏళ్ల ముందు ఏం జరిగిందో ఆలోచించండి.. ఇలా అందరూ సంతోషంగా ఉండే రోజు ఉందా ? ఇంతకన్నా ప్రభు త్వం సాధించేది ఏం ఉంది. ఒక్కసారి మనం ఉండే ప్రాంతం కోసం ఆలోచించండి. అన్ని సదుపాయాలూ కల్పించేందుకు ఎన్ని ఏ ళ్ళు పట్టయో.. అదే ఇప్పుడు జగనన్న కాలనీలు చూడండి. మీకే తెలుస్తుంది గతానికీ,ఇప్పటికీ ఉన్న తేడా ఏంటన్నది. అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో అన్ని వసతులతో కూడిన కాలనీలు నిర్మించాం. ఇళ్లు కాదు ఊళ్లు నిర్మించాం. నిలువ నీడ లేని పేదల ఆశలను నెరవేర్చాం. 500 కోట్ల రూపాయలు వెచ్చించి మన శ్రీకాకుళం నియోజకవర్గం లో పేదల కోసం భూములు కొనుగోలు చేశాం. చంద్రబాబు ఒక్క సెంటు కూడా కొని ఇచ్చిన దాఖలాలు ఆనాడు లేవు. శ్రీకాకుళం లాంటి నియోజవర్గంలో నా గెలుపునకు మీ అందరూ సహకరించడం వల్లనే మూడు సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాను. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. మరొక్కసారి విన్నవిస్తున్నాను. మీకు మేలు చేసిన ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. ఈ ప్రజా ప్రభుత్వా నికి అండగా నిలబడి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మీరంతా ఏకతాటిపై నిలిచి కృషి చేయండి అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు రావు, రూరల్ మండలం వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, నాయకులు కోణార్క్ శ్రీనివాస్ రావు, రావాడ మోహన్, టంకాల బాల కృష్ణ, కంచు వసంత, చంద్ర మౌళి, చిట్టి రవి కుమార్, యజ్జల గురు మూర్తి, సాదు కామేష్, మనోజ్, సుంకాన సురేష్ తదితరులు పాల్గొన్నారు.