విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సూచన, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు తెలిపారు.గురువారం వంగర మండల కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో వంగర మండల పరిధిలో ప్రతీ గ్రామ పంచాయతీలో కొత్తగా కమిటీలను నవంబర్ 16వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక అధ్యక్షుడు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులు, ఆరుగుగు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉంటారని చెప్పారు. అనుబంధ సంఘాలకు సంబంధించి యువజన, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ విభాగాలను కూడా పూర్తి చేయాలన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేయాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థం, రాజకీయాల కోసం కాకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారిని కమిటీల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.కమిటీలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మోసాలు చేసే వాళ్లు కాకుండా పార్టీకి కమిట్‌మెంట్‌తో పనిచేసే వాళ్లను నియమించాలన్నారు. గ్రామ, మండల పరిధిలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులను సమన్వయం చేసుకుని వెళ్లాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తాను ఎలా అయితే సమావేశం నిర్వహించి సూచనలు చేశానో అదే తరహాలో గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టుకుని కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. గ్రామ, డివిజన్ స్థాయిల్లో సైన్యంలా పని చేసే కమిటీలు ఉండాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి, మార్చిలో స్థానిక ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఉంటాయని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సూచన, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోలేదని, మనకు అధికారమే పరమావధి కాదని తెలిపారు. ప్రజల సంక్షేమమే ముఖ్యం కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలపై అనేక ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పోలీస్, రెవెన్యూ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నా ఎవరూ భయపడడం లేదని తెలిపారు. ఏడాదిన్నరగా చంద్రబాబు, అధికార పార్టీ నేతలు ప్రచారానికే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు.వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిలో ‘కోటి సంతకాల సేకరణ’ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల, పంచాయతీ స్థాయిలో ‘కోటి సంతకాల సేకరణ’ చేపట్టాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సూచన, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు సూచించారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ వంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించామని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందుబాటులోకి తేవడం కోసం రూ.8 వేల కోట్లతో ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో 2023–2024 నాటికే ఐదు మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించామన్నారు.కానీ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తోందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు.ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని చెప్పారు. మండల, పంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. సంతకాల సేకరణతో పాటు ‘ప్రజా వైద్యం.. ప్రజల హక్కు’ పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. సంతకాల సేకరణ ప్రారంభం మాత్రమేనని, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనెల 28వ తేదీన 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ, మండల పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు, వైస్ ఎంపీపీ, జిల్లా కార్యాచరణ కార్యదర్శి కిమిడి ఉమామహేశ్వర రావు,జిల్లా టీచర్స్ వింగ్ అధ్యక్షులు మరిసర్ల గంగా రావు, మండల మహిళా అధ్యక్షురాలు కాంబోతుల భగవతి, ఎంపిటిసి కనగల పద్మ, మండల పరిధిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.