దిగజారుడు మనిషికి దగాకోరుల మద్దతు

ఏబీఎన్‌ రాధాకృష్ణకి చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ల మద్దతు సిగ్గుచేటు

మహిళలను కించపరిస్తే జర్నలిజం, విశ్లేషణ అనడం హేయం 

ఏబీఎన్‌ రాధాకృష్ణపై తక్షణం కేసు నమోదు చేయలి

మండిపడిన వైయ‌స్ఆర్‌సీపీఅధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్, కైలే అనిల్‌ కుమార్‌  

తాడేపల్లి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్, కైలే అనిల్‌ కుమార్‌. 

  రాధాకృష్ణకు ఏం జరిగిందని సంఘీభావం?
:కైలే అనిల్‌ కుమార్, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే 

– రాధాకృష్ణకు ఏం జరిగిందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మహిళలను కించపరిచేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, వైయ‌స్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడిగా చిత్రీకరించడంపై వారు సిగ్గుపడాలి. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే పెదవి విప్పని పవన్‌ కళ్యాణ్, శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాస్వామ్యం ఖూనీ అనడం హాస్యాస్పదంగా ఉంది. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద పోలీసులే దాడి చేశారు. జర్నలిజం ముసుగులో సీఎం చంద్రబాబు చేసే ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌‘కు వంత పాడుతున్న ఏబీఎన్‌ రాధాకృష్ణకి తల్లికి, చెల్లికి, భార్యకు మధ్య తేడా తెలియడం లేదు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలకు తొందర్లోనే మహిళల చేతుల్లో చెప్పుదెబ్బలు తినడం ఖాయం. 

రాధాకృష్ణ వ్యాఖ్యలు మీ ఇంటి మహిళలకు అన్వయించుకోండి
:పుత్తా శివశంకర్, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి.

– వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది. మీరు మీ భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారేమో చెప్పాలి. దిగజారుడు రాతలను సంపాదకీయం అని ఒక్కరితోనైనా చెప్పించగలరా? మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, దాన్ని సమర్థిస్తూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేయడం సిగ్గుచేటు. రాధాకృష్ణ దిగజారుడు మాటలను విశ్లేషణలు అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం ఆయన నీతిబాహ్య విధానాలకు నిదర్శనం. ఇదంతా చూస్తుంటే అమరావతికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి అంతు చూస్తాం అన్నట్టుగా కూటమి నాయకులు బరితెగిస్తున్నారు. రాధాకృష్ణ  తీరు మార్చుకోకపోతే ఆయనకు గట్టిగా బుద్ధి చెబుతాం.

Back to Top