గిరిజన బిడ్డల‌కు అమ్మ ఒడి పథకంతో ఎంతో లబ్ధి  

  డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి తెలిపారు.

గిరిజనులను గత ప్రభుత్వం మోసం చేసింది

అమరావతి: గిరిజన బిడ్డలు అమ్మ ఒడి పథకం ఎంతో లబ్ధి చేకూర్చిందని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి తెలిపారు. పాదయాత్ర సమయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల కష్టాలు కళ్లారా చూశారని, అధికారంలోకి వచ్చాక అండగా నిలిచారన్నారు. గత ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని మండిపడ్డారు. అందుకే గిరిజనులు టీడీపీని తరిమికొట్టారని తెలిపారు. గిరిజన సంక్షేమంపై శాసన సభలో మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. 
 
గ‌తంలో ఎంతో మంది గిరిజనుల వ‌ద్ద‌కు వచ్చి అనేక హామీలు ఇచ్చారు . కానీ ఏ ఒక్క‌టీ అమ‌లు చేయ‌లేదు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో గిరిజనుల క‌ష్టాలు క‌ళ్లారా చూశారు. గిరిజ‌నులు త‌మ‌ కష్టాలు, నష్టాలు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టిలో పెట్టినప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. రాజన్న రాజ్యం జగనన్నతో మాత్రమే సాధ్యమవుతుందని గిరిజ‌నులు న‌మ్మి 2019 ఎలక్షన్ లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఏడు నియోజకవర్గాల్లో ఘ‌న విజ‌యాన్ని అందించారు.  వైయ‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు.  డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు గిరిజ‌నుల కోసం ఒక్క అడుగు వేస్తే..ఆయ‌న త‌న‌యుడిగా వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో రెండు అడుగులు ముందుకు వేశారు.  జ‌గ‌న‌న్న విద్యా దీవెన ద్వారా  జూలై 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఈరోజు హాస్టల్ ఖర్చులకోసం విద్యార్థులకు ప్రతి వ్యక్తి కూడా పదివేల రూపాయలు ఇస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, ఇతర డిగ్రీ , పీజీ విద్యార్థుల‌కు ఒక్కొక్కరికీ 20,000 రూపాయలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందన్న‌ విషయాన్ని తెలియజేస్తూ ఈ జగనన్న వసతి దీవెన జూన్ 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు రూ.74.44 కోట్లు ఖ‌ర్చు చేశారు. అమ్మఒడి పథకం ద్వారా స్కూల్‌కు పంపించే  ప్రతి తల్లికి కూడా 15 వేల రూపాయలు ఇస్తున్నారు.  జూన్ 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు   2.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం కోసం  843.80 కోట్ల రూపాయలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 

 కొంతమంది హామీలు ఇచ్చి నెరవేర్చని వాళ్ళు ఉంటారు.. కొంతమంది హామీలు ఇచ్చి ఏదో తూతూమంత్రంగా కంటితుడుపు చర్యగా నెర‌వేర్చే కార్యక్రమాలను చూశాం.  కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారు ఒక మంచి కార్యక్రమం పేదవాళ్లకు చేయాలనుకుంటే ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తారు.  దానికి నిదర్శనం ఈ రోజు జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా బ‌డికి వెళ్లే పిల్ల‌ల‌కు మంచి బ్యాగ్స్,  బట్టలు, షూస్‌ క్వాలిటీవి అంద‌జేస్తున్నారు.   జ‌గ‌న‌న్న గోరు ముద్ద ద్వారా విద్యార్థుల‌కు పౌష్టికాహారం అంద‌జేస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి మెనూ రూపొందించారంటే..పిల్ల‌ల‌పై ఆయ‌న‌కు ఎంత మ‌క్కువో అర్థమ‌వుతుంది.  బాలిక‌ల‌కు నెలసరి వచ్చే టైం లో ఎంతోమంది  సాంప్రదాయ పద్ధతులు అవ‌లంభిస్తూ ఇబ్బందులు ప‌డేవారు.  అటువంటి విద్యార్థుల కోసం కూడా ఈ రోజు ఒక తండ్రిలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచించి స్వేచ్ఛ కార్య‌క్ర‌మం ద్వారా ఉచితంగా న్యాప్‌క్విన్లు అంద‌జేస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్స్లో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 31,200 మంది బాలికలకు ప్రభుత్వం అందజేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా గురుకుల పాఠశాల లో ఉన్నటువంటి విద్యార్థులకు 17,065 మంది బాలికలకు న్యాప్‌కిన్లు అంద‌జేసిన‌ట్లు తెలిపారు.   

 నాడు నేడు- స్కూల్ కార్య‌క్ర‌మం ద్వారా ఈ రోజు స్కూల్స్లో డైనింగ్ హాల్, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్స్, లైట్స్, టాయిలెట్స్, మంచి కలర్ ఫుల్ టైల్స్ ఏర్పాటు చేశారు.  ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో కార్పొరేట్ స్కూల్స్  వాతావరణం క‌నిపిస్తోంది.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గిరిజ‌న ప‌క్ష‌పాతిగా ప్ర‌జారంజ‌క పాల‌న సాగిస్తున్నార‌ని పుష్పాశ్రీ‌వాణి తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top