కూటమికి షాకిచ్చిన ఉద్యోగులు 

 విజయవాడ: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగుల ఓటింగ్‌ సరళి కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులకు ఏకపక్షంగా ఓట్లు పడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు సమానంగా ఓట్లు వేయడం చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చూపిస్తోంది. పులివెందుల, నెల్లిమర్ల, పెడన, పిఠాపురం, ఉయ్యూరు, పలాసతో పాటు విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల సరళి కూటమికి ప్రతికూలంగా కనిపించింది. ఈ పరిణామం చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తికి సంకేతాలుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
Image

Back to Top