పార్ల‌మెంట్ స‌భ్యుడిగా డాక్ట‌ర్‌ గురుమూర్తి ప్ర‌మాణ స్వీకారం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  ఆశీస్సుల తో వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి లోక్ సభ సభ్యుడిగా  ఎంపికైన డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ఇవాళ లోక్‌స‌భ‌లో పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.   కొద్దిసేప‌టి క్రితం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం అయ్యాయి.  ఇటీవల ఉపఎన్నికల్లో గెలిచిన డాక్ట‌ర్ గురుమూర్తితో లోక్‌సభలో స్పీక‌ర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు.  అనంత‌రం స‌భ్యులు గురుమూర్తిని అభినందించారు. పార్లమెంట్‌ సమావేశాలు ఉదయం 11గంటల‌కు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top