తాడిపత్రి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు.. 

రోడ్డుపై బైఠాయించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

అనంతపురం: తాడిపత్రికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి (విశ్వేశ్వరరెడ్డి)లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఖరికి నిరసనగా ఇరువురు నేతలు అనంతపురంలోని కోర్టు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.  తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్యలను నిరసిస్తూ రోడ్డుపైనే కూర్చున్న అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కారణంగా కోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు.
 

Back to Top