వైయ‌స్ఆర్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడి

మంత్రి లోకేష్‌ ఆదేశాలతోనే ఆ పార్టీ గుండాల హేయం

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

విజయవాడలో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమ

ఏకంగా రాళ్లు, కోడిగుడ్లతో దీక్షా శిబిరంపై దారుణంగా దాడి

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వెన్నుపోటు పార్టీ పాశవికం

ఇది వెన్నుపోటు పార్టీ ఉన్మాదానికి పరాకాష్ట

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్‌

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి

డీఎస్సీలో అక్రమాలపై ఆధారాలతో సహా చూపాం

వాటికి సమాధానం చెప్పే ధైర్యం వెన్నుపోటు పార్టీకి లేదు

అందుకే ఈ తరహాలో దాడులు చేస్తున్న వెన్నుపోటు పార్టీ

లోకేష్‌ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

తాడేపల్లి: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై అధికార వెన్నుపోటు పార్టీ దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపైకి వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ వర్గీయులు దూసుకొచ్చి టెంట్లు లాగిపడేసి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారని ఆయన వెల్లడించారు. ఇది రౌడీయిజానికి పరాకాష్ట అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మండిపడ్డారు.
ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

వెన్నుపోటు పార్టీ ఉన్మాదానికి పరాకాష్ట:
    విజయవాడలో దీక్షా శిబిరంలోని టెంట్‌పై వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు మూత్ర విసర్జన చేయడం ఆ పార్టీ ఉన్మాద ఆలోచనలకు, వారి చేష్టలకు నిదర్శనం. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారిని అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. పైదా దీక్ష చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే అరెస్టు చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనలను అణచి వేయాలని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు.

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే:
    డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు, ఆ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి. ఇదే అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఇంకా చాలాచోట్ల పోలీసులను ఉపయోగించి, దీక్షా శిబిరాలు ధ్వంసం చేశారు. వెన్నుపోటు పార్టీ చేస్తున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేసే వరకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, వసతిదీవెన చెల్లింపులతో పాటు, నిరుద్యోగ భృతి అమలు చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top