నెల్లూరు గడ్డ.. వైయస్‌ఆర్‌ సీపీ అడ్డా అని నిరూపిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు

వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలునెల్లూరు: నెల్లూరు గడ్డ వైయస్‌ఆర్‌ సీపీ అడ్డా అని మరోసారి నిరూపిస్తామని వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.  నెల్లూరు నగరంలో ధనవంతులు, సామ్యాడికి జరుగుతున్న యుద్ధం జరుగుతుందని, సామాన్యుడి విజయానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌కు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ట్రంకు రోడ్డు వైయస్‌ జగన్‌ నినాదంతో మార్మోగింది. నామినేషన్‌ అనంతరం అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలంతా ఆలోచిస్తున్నారన్నారు. ప్రచారంలో విపరీతమైన స్పందన కనిపిస్తుందన్నారు. అవినీతి సొమ్ముతో అడ్డంగా ఉన్న నాయకులతో సామాన్యుడు పోటీ పడుతున్నాడని, ఈ పోటీ ప్రజలు అవినీతిపరులకు బుద్ధిచెప్పాలని కోరారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి పాలన ఎలా ఉంటుందో చూడాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 

 

Back to Top