ఇన్నాళ్లూ వచ్చిన డబ్బును నొక్కేశారా బాబు?

ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌
 

 అమరావతి: కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం స్పందించిన ఆయన, "వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు గారూ? పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు" అని ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also:  కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలి

Back to Top