అమరావతి : కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ(పాడా) నంచి తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోకడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, బ్యూటిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైయస్‌ఆర్ మెమోరియల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్ ఎస్టిమేషన్ వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్ ఉండాలని అధికారులకు సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన అన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను , విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో పోలవరం వద్ద కూడా పార్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు. Read Also: ఐదేళ్లు గొర్రెలు కాశారా..?