జగ్గంపేట నియోజకవర్గం: గండేపల్లి మండలం నీలాద్రి రావుపేట గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సభను నిర్వహించారు. మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ తోట నరసింహం గారు, తోట శ్రీ రాంజీ గార్ల ఆదేశాల మేరకు గ్రామ అబ్జర్వర్‌గా నియమితులైన రామకుర్తి రామచంద్రమూర్తి ఈ సభకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రామకుర్తి రామచంద్రమూర్తి మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల్లో నిజంగా శ్రమించే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2029 ఎన్నికల్లో తోట నరసింహం గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మద్దిపట్ల రామకృష్ణ చౌదరి, గండేపల్లి ఎంపీపీ చలగల దొరబాబు, రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రెటరీ తాళ్లూరి మధుకుమార్, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం జనరల్ సెక్రెటరీ ఒబిని వీరబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు పాలచర్ల వెంకన్న చౌదరి, నీలాద్రి రావుపేట గ్రామ సర్పంచ్ ములంపాక సురేష్ బాబు, మండల వాలంటరీ విభాగం అధ్యక్షుడు కాకి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై సభను విజయవంతం చేశారు.