134వ గంధ మహోత్సవ ఉరుసుకు  వైయస్‌ జగన్‌కు ఆహ్వానం

తాడేపల్లి: గుంటూరు నగరంపాలెంలో నిర్వహించనున్న శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా 134వ గంధ మహోత్సవ ఉరుసు ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేశారు. గుంటూరు నగరంపాలెంలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గంధ మహోత్సవ ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉరుసు సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ మస్తాన్‌ బాబాకు చాదర్‌ (శేషవస్త్రం), చందనం, శాండిల్‌ ఆయిల్‌ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు, ఆయన సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్‌ సాయి గణేష్‌ రెడ్డి, రావి జ్జానేశ్వర్‌ బావాజీ మస్తాన్‌ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top