ప్రజా సమస్యలపై బలంగా పోరాడేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకం

కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్‌ రెడ్డి

వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం

కర్నూలు: ప్రజా సమస్యలపై బలంగా పోరాడేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకం అని కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రతి కార్యకర్తకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించడం ద్వారా ప్రజల సమస్యలపై సమర్థంగా పోరాడగలమని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర స్థాయి ఎస్ఈసీ , సీఈసీ సభ్యులు, అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కమిటీల నిర్మాణ కార్యక్రమంపై చర్చించామ‌న్నారు.  పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి, ఆ కమిటీలను డిజిటలైజేషన్ చేయడం, తద్వారా ప్రతి కమిటీ సభ్యునికి పార్టీ గుర్తింపు కార్డు జారీ చేయడం ఈ కార్యక్రమంలో కీలక అంశాలుగా నిలిచాయ‌ని చెప్పారు. పార్టీ బూత్‌, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలను సమగ్రంగా ఏర్పాటు చేసి, ప్రతి కార్యకర్తకు స్పష్టమైన పాత్ర, బాధ్యతలు కేటాయించాలనే అంశంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో క్రమశిక్షణ, సమన్వయం, ప్రజలతో అనుసంధానం మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.  సమావేశంలో  జిల్లా అబ్జర్వర్ గంగుల ప్రభాకర్‌ రెడ్డి  , నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని రాంభూపాల్‌ రెడ్డి , జోనల్‌ ఇన్‌చార్జ్  చల్లా మధుసూదన్ , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి , పార్లమెంట్ సమన్వయకర్త  బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకులు ఆదోని మాజీ శాసనసభ్యులు  వై. సాయి ప్రసాద్‌ రెడ్డి , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు  వై. ప్రదీప్‌ రెడ్డి  , ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్  రాజీవ్‌ రెడ్డి , పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంగాటి శ్రీదేవమ్మ , ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరుపాక్షి గారి తనయుడు యువ నాయకులు  చంద్రశేఖర్ , కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్  సహా జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top