వైయస్ఆర్ జిల్లా: వేంపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్‌రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించగా, ఎంపీ అవినాష్ రెడ్డి అమ్మవారిని దర్శించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పులివెందులలో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్మించిన విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఉద్ఘాటన వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ వైయస్ ప్రమీలమ్మ, రాజయోగినీ, జయంతి , బ్రహ్మ కుమారీలు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విశ్వశాంతి, ఆధ్యాత్మిక విలువల ప్రాముఖ్యతను బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు వివరించారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి కార్యక్రమ నిర్వాహకులను అభినందించి, సమాజంలో శాంతి, నైతిక విలువల పెంపుకు ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు.