సప్తగిరి కాలనీలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం 

ప్రజలతో మమేకమైన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ 

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని సప్తగిరి కాలనీలో శుక్రవారం ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి .వి. ఉషాశ్రీచరణ్ పాల్గొని గ్రామ ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఆమెవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారని ప్రజలకు గుర్తు చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో పనిచేసే జననాయకుడు వైయ‌స్ జగన్ అని పేర్కొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని ఉషాశ్రీచరణ్ తెలిపారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా ప్రతి ఏడాది చేనేత కార్మికులకు రూ.24 వేల ఆర్థిక సహాయం అందించామని, అలాగే 50 సంవత్సరాలు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి నెల పెన్షన్ అందించే విధంగా కొత్త విధానాన్ని అమలు చేసిన ఏకైక నాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆమె విమర్శించారు. ప్రజలను మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, సోమందేపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top