నిర్ధిష్ట సమయంలోగా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి

పశ్చిమ గోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

ఆచంట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

ఆచంట: పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలంటే సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు  ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెం క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి  చెరుకుపాడు శ్రీ‌ రంగనాథరాజు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ప్ర‌సాద‌రాజు మాట్లాడుతూ..  పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో మండల పార్టీ కన్వీనర్‌తో పాటు గ్రామ పార్టీ కన్వీనర్లు, గ్రామ ఇన్‌చార్జ్‌లు కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు అనుబంధ కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర మాజీ మంత్రి చెరుకూడా రంగనాథరాజు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సీపీ బలం కార్యకర్తలేనని, వారి కష్టానికి తగిన గుర్తింపు కమిటీల ద్వారా లభిస్తుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంస్థాగత నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు  ముదునూరి మురళీకృష్ణ రాజు, మండల పార్టీ కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, జక్కం చెట్టి చంటి, పిల్లి నాగన్న, నల్లిమిల్లి బాబిరెడ్డి, ఎంపీపీ పోతినీడి వెంకటేశ్వర్లు, సుమంగళి దంపనబోయిన బాబురావు, చింతపల్లి గురుప్రసాద్, సుంకర సీతారాం, పోతుమూడి రామచంద్రరావు, చిన్నం ఏడుకొండలు, పిల్లి రుద్రప్రసాద్, కర్రీ వేణుబాబు, సత్తి విష్ణు కుమార్ రెడ్డి, ముప్పాల వెంకటేశ్వరరావు, పలివెల శ్రీను, తమిళంపూడి సూర్యారెడ్డి, భూపతి రాజు, శ్రీనివాసరాజు, గణేశుల తాడి రాజారెడ్డి, సుబ్బారావు ముత్యాల, బుర్ర రవికుమార్, రావి రత్నకుమార్, నాగేశ్వరరావు, సత్తి వెంకటరెడ్డి, దిద్దే శ్రీను, కాకిలేటి బాపిరాజు, కుక్కల కిరణ్, మండ నారాయణరెడ్డి, గుడిమెట్ల ఎల్లారెడ్డి, కేశవరపు గణపతి, భవాని ప్రసాద్, ఎడ్ల రామకృష్ణ, పాముల శ్రీను, నమ్మితి వేణు, బొరుసు రాంబాబు తదితర నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top