ఏపీ యువతకు బాబు వెన్నుపోటు 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో యువత మాత్రం అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో 8 త్రైమాసికాలకు గానూ ఫీజు రీయింబర్స్‌మెంట్లు, రూ.4,900 కోట్ల విద్యా దీవెన (Vidya Deevena), రూ2,200 కోట్ల వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు పేరుకుపోయాయని.. అలాగే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మోసం ద్వారా యువతను తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 

ఏపీలో కూటమి పాలన పరిస్థితులు యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇకనైనా మేల్కొని యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని.. వివేకానందుడి ప్రముఖ సూక్తిని ఒకదానిని(Arise, Awake, and facilitate..) ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌  హితవు పలికారు. 

Back to Top